సాధారణంగా బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవుతాయని, ప్రభుత్వ విధానాలను గవర్నర్ చెబుతారన్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామ చందర్ రావు. అయితే తెలంగాణలో మాత్రం గవర్నర్ ప్రసంగం లేకపోవడం ఇది రెండో సారి అన్నారు. గవర్నర్ స్పీచ్ లేదంటే ప్రభుత్వానికి విధివిధానాలు లేనట్టే…తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం కూడా తీసుకోను అని ఆమె చెప్పారు. రాజ్యాంగం లో ఎక్కడ కూడా గవర్నర్ ప్రసంగం తప్పనిసరి కాదు కానీ అది సంప్రదాయం. కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు గవర్నర్ ను టార్గెట్ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
Read Also: Siddaramaiah: హిట్లర్, ముస్సోలినీకి ఏమైంది.. మోదీకి కూడా అలాగే…
అసెంబ్లీ నీ ప్రో రోగ్ చేయకపోతే ఆర్డినెన్సు కూడా తీసుకురాలేరు… ఇది తెలంగాణ ప్రజలకు నష్టం. కెసిఆర్ నిజాం కు ఎంత మంచి అభిమాని అయిన …. నిజాం పాలన తీసుకు వస్తా అంటే తెలంగాణ ప్రజలు సహించరు..గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వరు .గవర్నర్ ప్రజా దర్బార్ పెడితే మీకేమి నొప్పి…మీ ఇగో లు పక్కన పెట్టండి… మహిళా అనే గౌరవం కూడా ఇవ్వడం లేదు. At హోమ్ కు వస్తానని చెప్పి చివరికి తలనొప్పి అని రాలేదు… జడ్జిలు వెయిట్ చేశారు.. ప్రతిపక్ష వాణిని వినిపించే అవకాశం ఇవ్వాలన్నారు రామచందర్ రావు. గవర్నర్ వ్యవస్థ పై మీ పాలసీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 26 జనవరి రోజున గవర్నర్ జెండా ఎక్కడ ఎగురవేయాలో ఇప్పటికీ క్లారిటీ లేదు….క్లారిటీ ఇవ్వాలని ఆయన కోరారు.
Read Also: Kartik Aryan: లాక్‌డౌన్‌లో రోజుకు 2 కోట్లు తీసుకొని.. ఆ పని చేశా