BJP Corporators: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో జీహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్ల సమావేశమయ్యారు. జల మండలి, జీహెచ్ఎంసి అధికారులపై గవర్నర్ కు కార్పొరేటర్ల ఫిర్యాదు చేశారు.
పెండింగ్‌లో ఉన్న బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. పురపాలక చట్ట సవరణ బిల్లుపై వివరణ కోరారు. అలాగే కొత్తగా మరికొన్ని ప్రైవేట్ విశ్వ విద్యాలయాలకు అనుమతిస్తూ చట్ట సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
పెండింగ్ బిల్లులను ఆమోదించేలా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై రచ్చ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై విమర్శలు, ట్రోల్ చేశారు. తనను బాడీ షేమ్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగా ఉంటే నిప్పులా మారతారని హెచ్చరించారు.
గవర్నర్ ప్రసంగంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై బయట చాలా నరికిందని ఎద్దేవ చేశారు. పులి తీరుగా బయట గాండ్రించిందని అన్నారు. పిల్లి తీరుగా సభలో ప్రసంగం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధిని బాధ్యులు గుర్తించకపోవడం బాధాకరమన్నారు.
రాజ్ భవన్ లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఈకార్యక్రమంలో.. తెలంగాణ గవర్నర్ తమిళ సై పాల్గొ్న్నారు. పొయ్యి మీద పొంగల్ వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. గవర్నర్ తో పాటు రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేవారు. తనఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నానే అనుమానం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మొదట తుషార్ పేరు ప్రస్తావించారని అనంతరం రాజ్‌భవన్ పేరు కూడా ప్రస్తావించారని గవర్నర్ తెలిపారు.