Governor Tamilisai: నా ఫోన్ టాపింగ్ అవుతున్నట్టు అనుమానం.. గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Tamilisai: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేవారు. తనఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నానే అనుమానం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మొదట తుషార్ పేరు ప్రస్తావించారని అనంతరం రాజ్‌భవన్ పేరు కూడా ప్రస్తావించారని గవర్నర్ తెలిపారు. అయితే తుషార్ గతంలో రాజ్‌భవన్‌లో తన ఏడీసీగా పనిచేశారన్న తమిళసై అంత మాత్రానికే రాజ్‌భవన్‌ను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోకి లాగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాది ప్రగతిభవన్ కాదు అంటూ మండిపడ్డారు. చాలా రోజుల నుంచి ప్రభుత్వానికి రాజ్‌భవన్‌కు మధ్యదూరం పెరుగుతూ వస్తున్న క్రమంలో ఇప్పుడు అదికాస్తా ముదిరినట్లు ఆమె మాట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివాదంపై బుధవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరముందని, వాటిని పరిశీలిస్తున్నానని ఆమె చెప్పారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించేందుకే తాను సమయం తీసుకున్నానని, ఆ బాధ్యత తనపై ఉందని చెప్పారు. ఖాళీల విషయమై సమగ్ర నివేదికను తాను ప్రభుత్వానికి ఇచ్చానని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని తాను ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తున్నానని.. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టతనిచ్చారు.
Read also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ఇద్దరు అరెస్ట్..
Also Read
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్ బిల్లు పై మంత్రి ఎప్పుడైనా రావొచ్చు… వివరణ ఇవ్వొచ్చు. ఒక నెల ఆలస్యం అయిందని రాజ్ భవన్ ముట్టడి చేస్తామని అంటున్న సంఘాలు… ఈ 8 ఏళ్లు ఆలస్యం అయినందుకు ప్రగతి భవన్ ముందు ఎందుకు చేయలేదన్నారు గవర్నర్ తమిళిసై. తాను ఎలాంటి బిల్లులను ఆపలేదని, బిల్లుల్ని తొక్కిపెట్టాననడం సబబు కాదని గవర్నర్ అన్నారు. కొత్త విధానంపై తనకు సందేహాలుండటంతో.. వాటిని పరిశీలిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు కొత్త నియామక బోర్డు అవసరం ఏమొచ్చిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. వీసీ పోస్టులు సైతం చాలా రోజులుగా ఖాళీగానే ఉన్నాయని, తాను డిమాండ్ చేశాకే వీసీలను నియమించారని తెలిపారు. ఎనిమిదేళ్లుగా వీసీలను నియమించనప్పుడు ఆందోళన చెందని ఐకాస.. ఇప్పుడు తన వద్ద నెల రోజులు ఆగిపోగానే ఎందుకింత ఆదోళన చేస్తోందని నిలదీశారు. తాను మొదటగా నియామకాల బిల్లుకే ప్రాధాన్యం ఇచ్చానని.. ఒకదాని తర్వాత మరొక బిల్లుని పరిశీలిస్తున్నానని.. బిల్లులు పంపిన వెంటనే వాటిని ఆమోదించడం మాత్రమే తన విధి కాదని పేర్కొన్నారు. తాను ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నానని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని గవర్నర్ వెల్లడించారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ఇద్దరు అరెస్ట్..
తాజావార్తలు
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..