రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైకి రేవంత్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
TamilaSai: తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
Diwali Wishes: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుభాకాంక్షలు తెలిపారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.
Tamilisai Soundararajan: సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇప్పటికే బీజేపీ డీఎంకే పార్టీ, ఉదయనిధి, సీఎం స్టాలిన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరిగా డీఎంకేపై విరుచుకుపడుతున్నారు. ఇండియా కూటమిలో డీఎంకే పార్టీ కూడా ఉండటంతో ఇండియా కూటమి తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Bhatti Vikramarka: ప్రభుత్వ ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోమని, రోడ్డుపైకి వచ్చి ఆస్తులు కాపాడుకుంటామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హెచ్చరించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.
Tamilisai Soundararajan: శారీరకంగా, మానసికంగా ధృడమైన పిల్లలు పుట్టేందుకు గర్భిణులు ‘సుందర కాండ’ పఠించాలని, ‘రామాయణం’ వంటి పురాణాలు చదవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదివారం అన్నారు. స్వతగా వైద్యురాలు అయిన తమిళసై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న ‘గర్భ సంస్కార్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సంవర్థినీ న్యాస్ ‘ గర్భ సంస్కార్’ కార్యక్రమం కింద వైద్యులు ‘శాస్త్రీయ, సాంప్రదాయ’ మందుల మిశ్రమాన్ని తల్లులకు అందిస్తారు.
Governor Tamilisai: అమరవీరులను స్మరిస్తూ బావోద్వేగంతో గవర్నర్ తమిళి సై ప్రసంగించారు. మొత్తం ప్రసంగాన్ని తెలుగులోనే గవర్నర్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై.
నేను తమిళ ఆడబిడ్డను.. తెలంగాణకు అక్కను.. నేను మీతో ఉన్నాను.. మీ కుటుంబంలో ఒక సభ్యురాలని.. మీ సమస్యలు విన్నాను.. నేను మీతో ఉన్నాను కచ్చితంగా మీ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తాను అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..
Governor Tamilisai: భద్రాద్రి రాముడి సేవలో తరించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న ఆమె.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు.. ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి భద్రాద్రి ఆలయం ఈవో రమాదేవి, ఆలయ సిబ్బంది, దేవస్థానం వేద పండితులు.. పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.. ఆ తర్వాత దేవస్థానంలోని మూలవరులను దర్శించుకున్న ఆమె.. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో గవర్నర్‌కు దేవస్థానం…