గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరు? అంటూ ప్రశ్నించారు. గతంలో గవర్నర్లు హుందాగా ప్రవర్తించే వారని, క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి గవర్నర్ ఏమైనా శాస్త్ర వేత్తనా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ పై బాల్క సుమన్ మండిపడ్డారు. వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రిగా చేసింది…
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. ఈనేపథ్యంలో.. నిన్న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్దేరి వెళ్లారు గవర్నర్. అయితే.. అక్కడి నుంచి భద్రాచలంలో గోదావరి వరద కారణంగా జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్ మాట్లాడనున్నారు. అయితే.. భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. గోదావరి…
ఈనెల 28న(రేపు) రాజ్‌భవన్ లో హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో తెలంగాణ గరవ్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణం చేయించేది గవర్నర్.. కాగా రాజ్ భవన్ లో ఈ సాంప్రదాయం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం.. ఉన్నతాధికారులు హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరలు హాజరవ్వాలి. అయితే గత కొంత కాలంగా…
భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ జులై 24న పదవీ విరమణ చేయనున్నారు. కొత్త రాష్ట్రపతి జులై 25న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో భారత నూతన రాష్ట్రపతిగా ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జులై 18న ఎన్నికలు జరగనుండగా… కొత్త రాష్ట్రపతి ఎవరన్నది జులై 21న జరగనున్న ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది. మరి రాష్ట్రపతి అభ్యర్థిగా అధికార ఎన్డీఏ,…
రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మిన్నంటాయి. కొద్దిపాటి అధికార గణం.. కళాకారుల సమక్షంలో వేడుకలను నిర్వహించింది రాజ్‌భవన్. తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ మాత్రమే కాదు.. ఒక సహోదరిని కూడా. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. రాజ్ భవన్ స్కూల్ లో భోజన సౌకర్యం కల్పించామని అన్నారు. భద్రాచలం, ఖమ్మం ఆదివాసులతో భోజనం చేసి..పౌష్టికాహారం…
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గవర్నర్ తమిళిసై చుట్టూ తిరుగుతున్నాయి.. ప్రభుత్వంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. ఇక, కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే.. అధికార టీఆర్ఎస్ మాత్రం ఆమెను టార్గెట్ చేసి కౌంటర్ ఎటాక్ చేస్తోంది… తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్‌కి కూడా పరిమితులు ఉంటాయి… ప్రధాని, హోం మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అని…
మనదేశంలో గవర్నర్ వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎప్పటినుంచో వుంటోంది. రాజ్యాంగ బద్ధమయిన పదవిని రాజకీయాలకు వాడుకుంటున్నారని, ప్రభుత్వాలను సరిగా పనిచేయకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఏనాటినుంచో వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతోందంటున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మళ్ళీ ఈ అంశం తెరమీదకు వచ్చిందనే చెప్పాలి. గతంలో ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో వివాదం తలెత్తింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో గవర్నర్ వ్యవహరించిన…
తెలంగాణ సర్కార్, గవర్నర్ మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంపై ఇప్పటికే ఘాటుగా స్పందించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఇక, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్న ఆమె.. అత్యున్నత పదవిలో ఉన్నవారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక, నన్ను ఎవరూ భయపెట్టలేరని..…