Gutha Sukender Reddy: తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధిని బాధ్యులు గుర్తించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేసిందని ప్రశ్నిస్తే.. జాతీయ రహదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ క్షేత్రాలు, కొత్త భవనాలపై విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణ అభివృద్ధికి నోచుకోని కొందరిని ఏమీ చేయలేరని అన్నారు.
Read also: Basara Temple: బాసర అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణలో ఆందోళన కర పరిస్థితులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై. రాష్ట్రం లో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. కొందరికి ఫార్మ్ హౌస్ లు కాదు.. అందరికీ ఫార్మ్ లు కావాలని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని తెలిపారు. కొంత మందికి నేను నచ్చక పోవచ్చు..కానీ.. నాకు తెలంగాణ వాళ్ళు అంటే ఇష్టమన్నారు. ఎంత కష్టం అయిన పని చేస్తానని సంచలన వ్యాక్యలు తెలిపారు. పవిత్ర తెలంగాణ నేలపై జాతీయ జెండా ఎగురవేయడం గర్వంగా ఉందన్నారు. దేశభక్తితో కూడిన ఆరు దశాబ్దాల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం అని తెలిపారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ఇతరులకు అభినందనలని, సవాళ్లకు అనుగుణంగా కొత్త విధానాలు అనుసరిస్తున్న రైతుల స్ఫూర్తికి సెల్యూట్ అన్నారు గవర్నర్. రాష్ట్రంలో జాతీయ రహదార్ల విస్తరణ కు భారీగా నిధులు ఇస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
Maharashtra: లిఫ్ట్ ఇస్తామని చెప్పి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..