తెలుగు విశ్వ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…. బతుకమ్మ పాటలలో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేస్తే, తెలుగు బాష మరింత పరిపుష్టం అవుతుందన్నారు. తెలంగాణ జాగృతితో పాటు, అనేక సంస్థలు బతుకమ్మ పండుగకు సంబంధించి పాత పాటలు సేకరిస్తున్నారని… పాత బతుకమ్మ పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేసినట్లైతే,…
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను తెలంగాణ గవర్నర్ తమిళి సై అభినందించారు. కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళి సై అభినందించారు. కళాకారుడి కి పవన్ కళ్యాణ్ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ను అభినందిస్తూ ట్వీట్…
హైదరాబాద్ 35 వ సెయిలింగ్ వీక్ నిర్వహించడం ఆనందంగా ఉంది. సెయిలర్స్ అందరూ రియల్ ఛాలెంజర్స్ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ట్విన్ సిటీస్ సెయిలింగ్ వీక్ కు అధిత్యం ఇవ్వడం ఆనందంగా ఉంది.హుస్సేన్ సాగర్ లేక్ తెలంగాణ ప్రైడ్ అని తెలిపారు. ఇక టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న సెయిలర్స్ నేత్ర కుమానన్, విష్ణు శరవణన్ కు అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి పోటీల్లో ఉన్న సంజయ్ కీర్తి అశ్విన్ అజయ్ కంగ్రాట్స్.. హుస్సేన్…
ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ గురువారం భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. తెలంగాణ, పాండిచ్చేరి లోని తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. ప్రధానికి పీఎం అండ్ పీఎం, మరో పుస్తకాన్ని గవర్నర్ తమిళ సై అందించారు. కోవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకారం అందిందని తమిళ సై తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం సమర్థవంతంగా అన్ని…
అభివృద్ధికి , సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యూనివర్సిటీలు పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపు నిచ్చారు. విద్యార్థులలో ఉద్యోగ నైపుణ్యాలతో పాటు, ఎంటర్ప్రెన్యూరియల్ నైపుణ్యాలు కూడా పెంపొందించాలని డాక్టర్ తమిళి సై అన్నారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “జాతీయ విద్యా విధానం 2020: కామర్స్ బిజినెస్ ఎడ్యుకేషన్ దృక్పదాలు” అన్న అంశంపై నేషనల్ వెబినార్ లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. read also :…
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్నారు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్. గిరిజనులలో కోవిడ్ వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచడానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సోమవారం రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం లోని కె సి తండా లో గిరిజనుల తో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల గిరిజనులలో ఉన్న అపోహలు తొలగించడం, వారిలో 100% వ్యాక్సినేషన్ సాధించడం లక్ష్యాలుగా గవర్నర్ గిరిజన తండా లో వారితో పాటు టీకా తీసుకుంటారు. గిరిజనులకు…
ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై తో భేటీ కానున్నారు కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ పిలుపు మేరకు గవర్నర్ ను కలిసి రాష్ట్రపతి పేరున ఉన్న వినతి పత్రం అందజేస్తారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ లు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ లు పాల్గొంటారు. దేశంలో కరోనో వ్యాప్తిని అరికట్టడం కోసం ఉచితంగా ప్రతి ఒక్కరికీ…
వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ పోరాటంలో వ్యాక్సిన్ శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు అన్ని రకాల చర్యలతో ఉత్పత్తిని వేగవంతం చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ఈ రోజు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు సంబంధించిన ప్రతినిధులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుండి వస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ దిగుమతి, మన దేశంలో తయారీ, పంపిణీ…
కరోనా విపత్తుతో ప్రజలు చితికిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కి వినతిపత్రం సమర్పించారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. అందులో ”కరోనాను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైంది. ఫలితంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడంతో గ్రామీణులు ముఖ్యంగా పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వైద్య వసతులు పెంచడంలో టీఆర్ఎస్…
కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయికి చేరుతున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. గత యేడాది కరోనా క్రైసిస్ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు సినీ పెద్దలు నిత్యావసరాలను అందించారు. అప్పుడు వసూలు అయిన విరాళలలో కొంత మొత్తం ఇంక ఈ ఛారిటీ సంస్థలో ఉంది. దాంతో చిరంజీవి ఆ మొత్తాన్ని వాక్సినేషన్ కు ఉపయోగించాలని భావించారు. గురువారం నుండి 45 సంవత్సరాల పైబడిన సినీ కార్మికులు,…