కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో తమిళనాడు ప్రభుత్వం సోమవారం నుండి ధియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తూ శనివారం జీవోను జారీ చేసింది. అయితే ఏపీలో మాదిరిగా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది. దాంతో రోజుకు కేవలం మూడు ఆటలతో సరిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తమిళనాడుకు చెందిన సినిమా జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో చాలా రంగాలకు కరోనా నిబంధనల నుండి…