Karur Stampede: కరూర్‌లో నిర్వహించిన దళపతి విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే.. తాజాగా ఈ అంశంపై విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ అక్టోబర్ 27న చెన్నైలోని మహాబలిపురంలో కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను కలవనున్నారు. ఈ తొక్కిసలాట జరిగిన నెల రోజుల తరువాత ఈ తరుణం చోటు చేసుకోనుంది.
తొక్కిసలాట ఘటనపై టీవీ కే పార్టీ లో చర్చ జరిగింది. తొక్కిసలాట ఘటనకు కారణం స్టాలిన్ ప్రభుత్వమే అంటూ టీవీకే పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాము అడిగిన ప్రాంతంలో కాకుండా చిన్నపాటి రోడ్డులో సభ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో.. ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… చెన్నై దుండిగల్ జిల్లా కరూర్ లో టీవీ కే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ రోడ్ షో నిర్వహించారు. దీంతో హీరో విజయ్ ను చూసేందుకు భారీగా…
Karur TVK Rally Stampede: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ నేతృత్వంలో జరిగిన మెగా రాజకీయ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కనీసం 31 మంది మరణించారని సమాచారం. హాజరైన వారిలో చాలా మంది కుప్పకూలిపోయారని తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో విజయ్ తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ముగించారు. "పోలీసులు, దయచేసి సహాయం చేయండి"…