మిల్కీబ్యూటీ తమన్నా అబ్బాయిలా మారిపోయింది.. హాట్ హాట్ డ్రెస్ ల్లో దర్శనమిచ్చే భామ సడెన్ గా ప్యాంటు షర్ట్ వేసింది.. మూతికి మీసం వచ్చేసింది.. ఇక షాకింగ్ ట్రాన్సపర్మేషన్ కి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. హాట్ బ్యూటీ తమన్నా ఏంటీ ఇలా మారిపోయింది అంటూ షాక్ అవుతున్నారు. అయితే ఇదంతా సినిమా కోసమే అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తమన్నా నటించిన ఎఫ్ 3 చిత్రం విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం విదితమే. ఇక…
అంతర్జాతీయంగా పేరున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి పలువురు హీరోయిన్స్ తహతహలాడుతుంటారు. గతంలో ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ వంటి వారు ఈ ఫెస్టివల్ కు రెగ్యులర్‌గా అటెండ్ అయ్యేవారు. ఇక మకి కొందరు తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి కూడా వస్తుంటారు. ప్రస్తుతం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనటానికి ఈవెంట్ నిర్వాహకులు పాన్-ఇండియా అప్పీల్ ఉన్నవారిని ఆహ్వానించారట. మే 17న ప్రారంభమై 28న ముగిసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్‌పై నడవడానికి…
ఈమధ్య కాలంలో విడుదలైన ప్రతీ పెద్ద సినిమాకు తెలంగాణ రాష్ట్రంలో టికెట్ రేట్లు ఎంత భారీగా పెంచారో అందరికీ తెలుసు! చివరాఖరికి డబ్బింగ్ సినిమాల రేట్లను సైతం అమాంతంగా పెంచడం జరిగింది. అయితే, టికెట్ రేట్ల హైక్‌తో కేజీఎఫ్: చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు బాగానే లాభపడ్డాయి. అంచనాలకి మించి ఎంటర్టైన్ చేయడంలో సఫలమయ్యాయి కాబట్టి, జనాలు టికెట్ రేట్లను పట్టించుకోకుండా ఆ సినిమాల్ని చూసేందుకు థియేటర్ల ముందు బారులు తీరారు. కానీ, మిగతా సినిమాల విషయంలో…
ట్యాలెంటెడ్ నటుడు సత్యదేవ్ చేస్తోన్న పలు ప్రాజెక్టుల్లో గుర్తుందా శీతాకాలం ఒకటి. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను.. దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగిసి.. చాలాకాలమే అవుతోంది. ఎప్పట్నుంచో దీన్ని విడుదల చేయాలని, మేకర్స్ కసరత్తు చేస్తూనే ఉన్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఇది విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ళ తర్వాత ఈ సినిమాకు మోక్షం లభించబోతోంది. లేటెస్ట్ అనౌన్స్మెంట్ ప్రకారం.. ఈ సినిమాను…
తమన్నా బౌన్సర్ గా నటిస్తున్న ‘బబ్లీ బౌన్సర్’ షూటింగ్ పూర్తి కావచ్చింది. పలు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న మధుర్ భండార్కర్ దీనికి దర్శకుడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగిల్ పిక్చర్స్ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తర భారతంలోని బౌన్సర్ సిటీ అసోలా ఫతేపూర్‌కి చెందిన ఓ మహిళా బౌన్సర్ కథ. తమన్నా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇంకా 5 రోజుల షూటింగ్ మాత్రమే…
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ‘ఎఫ్ 3’ మూవీ షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్ధం కాగా, ‘గుర్తుందా శీతాకాలం’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ‘భోళా శంకర్’సెట్స్ పై ఉంది. అలానే ఈ అందాల చిన్నది హిందీలోనూ మూడు చిత్రాలలో నటిస్తోంది. ‘బోలే చుడియా’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అలానే ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ సినిమా…
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బీచ్ ఒడ్డున వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. అందమైన మాల్దీవుల్లో హొయలు పోతూ ఆమె షేర్ చేసిన బికినీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నా ఫ్లోరల్ కేప్‌తో పింక్ కలర్ బికినిలో ఉండగా… ఆమె బోల్డ్ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక వీడియోతో పాటు తమన్నా ఐస్ క్రీం సైకిల్ తొక్కుతున్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. ఆ పిక్ లో తమన్నా పింక్ క్రాప్…
ట్యాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా చిన బాబు – ఎంఎస్ రెడ్డి సమర్పణలో భావన రవి – నాగశేఖర్ – రామారావు చింతపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన…