Milky beauty Tamannaah movie in OTT!
మిల్కీ బ్యూటీ తమన్నా ‘బబ్లీ బౌన్సర్’ మూవీలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తో ఈ మూవీని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాక్సర్స్ టౌన్ గా పేర్గాంచిన అసోలా ఫతైపూర్ బ్యాక్ డ్రాప్ లో, బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమన్నా ఇందులో మహిళ బౌన్సర్ గా నటిస్తోంది. భారతదేశంలో తొలిసారిగా ఓ మహిళ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాను సెప్టెంబర్ 23న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్, సాహిత్ వైద్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు.