యంగ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం “గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ మూవీస్, శ్రీ వేదాక్షర మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఇది పర్ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ట్రైలర్ సత్యదేవ్ తనకు…
మిల్కీ బ్యూటీ తమన్నా అభిమానులకు కొత్త ఛాలెంజ్ విసిరింది. ఇట్స్ యువర్ టర్న్ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోతో అందరినీ ఉత్సాహ పరుస్తోంది. ఈ బ్యూటీ “గని” చిత్రంలోని ‘కొడ్తే’ అనే స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 16న విడుదలైన ఈ సాంగ్ లో తమన్నా భాటియా చేసిన ప్రత్యేక డ్యాన్స్ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ‘కొడ్తే’ సాంగ్ ఫీవర్‌ని మరో మెట్టు ఎక్కిస్తూ పెప్పీ సాంగ్ స్టెప్ ను వేయమంటూ అందరినీ…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో అతిరధ మహారథులే నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, కన్నడ సూపర్ హీరో ఉపేంద్ర, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ..…
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీల్లో ముందుకు తమన్నాకు బర్త్ డే విషెస్ పంపిన బ్యూటీ సమంత. సమంత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో “అద్భుతమైన తమన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రేమ నుంచి శక్తిగా ఎదగడం నేను చూశాను. ఈ రోజు మిమ్మల్ని ఇలా నటిగా / వ్యక్తిగా చూడటం నాకు…
సినిమా ఇండస్ట్రీలో దశాబ్దకాలంగా స్టార్ హీరోయిన్లుగా హవా కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. ఇక దక్షిణాదిలోని ఫ్యాషన్ నటీమణులలో ఈ బ్యూటీ స్టైల్ ప్రత్యేకం. స్ట్రీట్ స్టైల్ నుండి గౌన్ల వరకు, చీర నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు తమన్నా ఫ్యాషన్ సెలక్షన్ అందరి దృష్టినీ ఆకట్టుకుంటాయి. తమన్నాకు ఏసింగ్ కో-ఆర్డ్ సెట్స్ అండ్ కలర్ బ్లాకింగ్‌లో డాక్టరేట్ సర్టిఫికేట్ ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ బ్యూటీకి ఫ్యాషన్ పై ఇంత మంచి అభిరుచి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్3’ షూటింగ్ ని పూర్తిచేస్తూనే చిరు సరసన ‘బోళా శంకర్’ చిత్రంలో నటిస్తుంది. ఇక సినిమాలు కాకుండా అమ్మడు ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. తాజాగా ఒక యాడ్ షూట్ బ్రేకులో మిల్కీ బ్యూటీ ఇదిగో ఇలా దేవతా రూపంలో ప్రత్యక్షమైంది. ఒంటి నిండా ఆభరణాలు, తలపై కీరిటం పెట్టుకొని భారతీయ సాంప్రదాయం ప్రకారం అరిటాకులో భోజనం చేస్తూ కనిపించింది. అరిటాకు…
జెమిని టీవిలో ప్రసారం అయ్యే “మాస్ట్‌ర్ చెఫ్” కార్యక్రమానికి తమన్నా భాటియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ కార్యక్రమానికి బాగానే ఆదరణ వచ్చిన ఆ తర్వాత ఎందుకో అంతగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో తమన్నా స్థానంలో బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను తీసుకున్నారు. దీంతో తమన్నా ప్రొడక్షన్ హౌస్‌కు షాక్ ఇచ్చింది. తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న ఈ ముద్దుగుమ్మ తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు లీగల్ నోటీసులు పంపించిందని సమాచారం.
దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘సీటీమార్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లోకి రానుంది. ఈ సినిమాలో గోపీచంద్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా.. దిగంగన సూర్యవంశీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. భూమిక ముఖ్య పాత్ర పోషిస్తోంది. కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో గోపీచంద్, తమన్నాలు కబడ్డీ కోచ్‌లుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకోన్నారు. పవన్ కుమార్ సమర్పణలో సిల్వర్ స్ర్కీన్ పతాకంపై శ్రీనివాసా చిత్తూరి ఈ…
హీరో గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ‘సీటీమార్’.. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో ‘సీటీమార్’ ట్రైలర్ విడుదల చేశారు. గోపీచంద్ ఆంధ్ర కోచ్ గా, తమన్నా తెలంగాణ కోచ్…
మిల్కీ బ్యూటీ తమన్నా రచయితగా మారింది. తాజాగా ఆమె తన బుక్ ను రిలీజ్ చేసింది. ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ ఈరోజు తన కొత్త పుస్తకం ‘బ్యాక్ టు ది రూట్స్’ ను ఆవిష్కరించింది. ఈ బుక్ కు ప్రముఖ లైఫ్ స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో సహ రచయిత. ఈ పుస్తకంలో తమన్నా ఆరోగ్య రహస్యాలను రివీల్ చేసింది. ఈ బుక్ ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అమెజాన్‌లో మొదటి స్థానంలో ఉంది.…