Bholaa Shankar: రూమర్స్ కు ‘భోళాశంకర్’ టీమ్ చెక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి తాజాచిత్రం ‘ఆచార్య’ పరాజయం పాలు కావడంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపై చిరంజీవి పునరాలోచనలో పడ్డారనే వార్త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంకీ కుడుములతో చిరంజీవి చేయాలనుకున్న సినిమా అటకెక్కేసిందని కొందరు అంటే, మెహర్ రమేశ్ రూపొందిస్తున్న ‘భోళా శంకర్’దీ అదే పరిస్థితి అని మరికొందరు రూమర్స్ సృష్టించారు. అయితే వాటిని ఇన్ డైరెక్ట్ గా ఖండిస్తూ చిత్ర నిర్మాత ఓ వార్తను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కు సిద్ధమౌతోందని, జూన్ 21 నుండి అది మొదలవుతుందని చెప్పారు. ‘మెగావైబ్ తో కొత్త షెడ్యూల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’ అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ కూడా చేసింది.
Also Read
- Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో 'ఇరుముడి'.. ఆ మార్క్ సాధ్యమేనా?
- Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ రాగా, ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి మెగా స్టైలిష్ గా కనిపించి అలరించారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షకుడిగా, తిరుపతి మామిడాల డైలాగ్ రైటర్ గా , మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ ఏడాది చివర్లో ‘భోళా శంకర్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!