ఊహకందని విధంగా ‘సీటీమార్, లవ్ స్టోరీ’ చిత్రాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. థియేటర్లకు ప్రేక్షకులు పెద్దంతగా రాకపోవడం, కరోనా భయాలు తొలగకపోవడం వల్ల అవి వాయిదా పడ్డాయంటే అర్థం ఉంది. కానీ ఓటీటీలో సెప్టెంబర్ 9న స్ట్రీమింగ్ అవుతుందని చెప్పిన ‘మాస్ట్రో’ సినిమా సైతం సెప్టెంబర్ 17కు వాయిదా పడింది. నితిన్, నభా నటేశ్ జంటగా నటించిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించింది. హిందీ చిత్రం ‘అంధాధూన్’ కు రీమేక్ అయిన ‘మాస్ట్రో’…
గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘సీటీమార్’ మూవీ విడుదల తేదీ విషయంలో ఉన్న సస్పెన్స్ కు తెర పడింది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్న వార్త నిజమైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. కొంతకాలంగా తమ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే పక్కాగా విడుదల చేస్తామని, అదీ సెప్టెంబర్ మాసంలో ఉంటుందని నిర్మాతలు చెబుతూ వచ్చారు. ఇవాళ సెప్టెంబర్ 3వ తేదీ ఈ మూవీ కోసం లాక్ చేసినట్టు అధికారికంగా…
ఇప్పటికే తెలుగులో, తమిళంలో వెబ్ సిరీస్ లు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా నెక్ట్స్ హిందీలోనూ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నిజానికి కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ మూవీ చేసింది ఆనాటి టీనేజ్ ట్యామీ. అయితే, తరువాత సౌత్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన ఆమె బీ-టౌన్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడీ కట్టేశాక మళ్లీ హిందీ తెర మీదకు వెళ్లింది. అజయ్ దేవగణ్, సైఫ్ అలీఖాన్ లాంటి పెద్ద…
దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లోను రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ మిల్కీ బ్యూటీ హవా తెలియంది కాదు. సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామర్ అందాలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి తమన్నా పసందైన ఆహారాన్ని ఆరగిస్తుండటంతో తను ప్రయాణించాల్సిన విమానాన్ని అందుకోలేకపోయిందని షేర్ చేసింది. నూడిల్స్ ఫొటోను షేర్ చేస్తూ.. నేను ఎక్కాల్సిన ఫ్లైట్…
మిల్కీ బ్యూటీ తమన్నా ముచ్చటగా మూడో వెబ్ సీరిస్ కు పచ్చ జెండా ఊపేసింది. ఇప్పటికే తెలుగులో ‘లెవన్త్ అవర్’, తమిళంలో ‘నవంబర్ స్టోరీ’ వెబ్ సీరిస్ లలో తమన్నా నటించింది. ‘లెవన్త్ అవర్’ బిజినెస్ వరల్డ్ నేపథ్యంలో సాగే వెబ్ సీరిస్ కాగా, ‘నవంబర్ స్టోరీ’ అందుకు పూర్తి భిన్నమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సీరిస్. ఈ రెండు వెబ్ సీరిస్ లలో తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో మరికొంతమంది నిర్మాతలు…
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. అలా తమన్నా కూడా షూటింగ్‌లు లేక ఇంట్లోనే ఉంటున్నారు. అయితే తాజాగా తమన్నా ఓ సందేశాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. షూటింగ్స్ లేక రోజువారీ పనిదినాల్లో కూడా మార్పులు రావడంతో తమన్నా డైలామాలో తెలుస్తోంది. ‘స్నానం చేయాలా.. ? వద్దా..? అనే సందేశాన్ని వ్యక్తం చేస్తూ.. ఓ సలహాని ఇవ్వాలంటూ కోరింది. లాక్ డౌన్ ఇలా…
హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’ కు రీమేక్‌గా తెలుగులో ‘మాస్ట్రో’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తుండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌కు జోడీగా నభా నటేష్ నటిస్తోంది. తమన్నా ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. అయితే ‘అంధాధున్’ సినిమాలోని టబు పాత్ర పోషిస్తున్న తమన్నా రీసెంట్ గా స్పందించింది. ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నానని తెలిసినప్పటి నుంచి, దాని ఒరిజినల్ చూడకూడదని నిర్ణయించుకున్నట్లు తమన్నా చెప్పింది. తెలుగులో తాను మరింత కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని…
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ‘లెవెన్త్ అవర్’తో తన మొదటి తెలుగు వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’లో ప్రసారం అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు భారీగా ప్రచారం కల్పించినప్పటికీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. కాగా తమన్నా ‘ఆహా’ కోసం మరిన్ని వెబ్ సిరీస్‌లకు సంతకం చేస్తోంది. డిజిటల్ రంగంలో మొదటి వెబ్ సిరీస్…