అఫ్ఘాన్‌లో ఆకలి కేకలు.. హామీలు తుంగలో తొక్కిన తాలిబన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊహించని విపత్తులా వచ్చి పడిన తాలిబన్ల పాలనతో అఫ్ఘానిస్తాన్ కునారిల్లుతోంది. అంతర్జాతీయ సమాజం సాయాన్ని నిలిపివేయడంతో ఆర్థికపరిస్థితి పూర్తిగా దిగజారింది.ఉపాధి లేక భార్యా పిల్లల కడుపు నింపేందుకు అఫ్గానీలు.. అవయవాలను అమ్ముకుంటున్నారు.ఇక్కడి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ పేదరికంలోకి జారిపోయింది. ప్రజల్లో చాలా మందికి ఉపాధి కరువైంది. పనులు దొరక్కపోవడంతో తమ కుటుంబాల్ని పోషించుకునేందుకు అవయవాలను సైతం అమ్ముకునే దౌర్భాగ్యస్థితికి చేరారు ఆఫ్గనీలు. ముఖ్యంగా పశ్చిమ ప్రావిన్స్‌లోని హెరాత్ ప్రాంతానికి చెందిన చాలా మంది …కుటుంబానికి తిండి పెట్టలేక కిడ్నీలు అమ్ముకుంటున్నారు.
Also Read
గతేడాదిలో 85కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌లు చేశారు వైద్యులు. కిడ్నీలు అమ్ముకునే వాళ్ల ఆర్ధిక పరిస్థితుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం లేదని..దాత, కొనుగోలుదారుల ఒప్పందంతోనే మూత్రపిండాల ఆపరేషన్‌లు చేస్తున్నట్లుగా వెల్లడిస్తున్నారు.అయితే కిడ్నీలను అమ్ముకునేందుకు వస్తున్న వాళ్లంతా తమ తాత్కాలిక ఆర్ధిక అవసరాలను మాత్రమే చూసుకుంటున్నారని..ఆపరేషన్ తర్వాత తలెత్తే శాశ్వత అనారోగ్య సమస్యలను ఆలోచించడం లేదని డాక్టర్లు వాపోతున్నారు. ఆఫ్గానిస్తాన్‌లో రోజురోజుకూ నిరాశ్రయుల సంఖ్య పెరిగిపోతోంది.
గతేడాది ఆగస్ట్ నెలలో అమెరికా, నాటో దళాలు అఫ్ఘనిస్తాన్‌ని వదలివెళ్లడంతో అక్కడ తాలిబాన్లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే తాలిబన్లు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో అంతర్జాతీయ సమాజం …ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధిక లావాదేవీలను నిలిపివేయడంతో పాటు ఎలాంటి సహాయ, సహకారాలు ఇవ్వమని తేల్చి చెప్పింది. దీంతో కొద్దిరోజులుగా అఫ్ఘనిస్తాన్‌లో దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అఫ్ఘానిస్తాన్, పొరుగు దేశాలకు ఐక్యరాజ్యసమితి కొద్దిపాటి ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!