ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో తిరిగి ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని ప్రపంచం మొత్తం అందోళన చెందుతున్నది. ఆఫ్ఘనిస్తాన్ చిన్నదేశమే అయినప్పటికి భారత్‌కు మిత్రదేశం. ఆ దేశంలో భారత్ కోట్లాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి జాతీయ ప్రాజెక్టులు, రహదారులు నిర్మించింది. ఇప్పుడు తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘన్ పాలన వెళ్లడంతో దాని ప్రభావం అనేక వస్తువులపై పడే అవకాశం ఉన్నది. ఇండియా నుంచి అనేక వస్తువులను దిగుమతి చేసుకునే ఆఫ్ఘనిస్తాన్, ఇకపై ఇండియా నుంచి ఆ వస్తువులను…
2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో వరల్డ్ ట్రేడ్ టవర్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు జూనియర్ బుష్ ఆఫ్ఘనిస్తాన్‌లోని అల్‌ఖైదా నాయకుడు లాడెన్ ఉన్నాడని, అతడిని తమకు అప్పటించాలని అమెరికా కోరింది. కానీ, అందుకు అప్పటి తాలిబన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఆఫ్ఘన్‌లోని తాలిబన్ సేనలపై అమెరికా సైనికులు దాడులు చేశారు. తాలిబన్‌లను తరిమికొట్టి ఆ దేశంలో ప్రజాస్యామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పారు. అప్పటి…
తాలిబన్ల పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. లక్షలాది మంది సైనికులు, ఆధునిక ఆయుధసంపత్తి, 20 ఏళ్లుగా అమెరికా సైన్యం ఇచ్చిన ట్రైనింగ్‌లో రాటు తేలిన ఆఫ్ఘన్ సైనికులను రెండు వారాల వ్యవధిలోనే ఓడించి దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు. తాము లేకున్నా, ఆఫ్ఘన్ సైనికులు పోరాటం చేయగలరనే ధీమాతో ఆమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. సెప్టెంబర్ 11 వరకు ఆఫ్ఘన్ నుంచి పూర్తిగా వెనక్కి వచ్చేయాలని ఆమెరికా నిర్ణయం తీసుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. చాలా ప్రాంతాల్లో…
అనుకున్నతం పని అయిపోయింది.. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లోని 19 రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల్లో పాగా వేసిన తాలిబన్లు.. ఇక. ఆఫ్ఘన్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేదశగా కదులుతున్నారు.. దీనిలో భాగంగా తాలిబన్ తిరుగుబాటుదారులు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిరాని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ ప్రకటించింది.. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఇప్పటికే ఆక్రమించారు తాలిబన్లు.. ఇప్పుడు రాజధాని నగరాన్నీ తమ ఆధీనంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్‌లో అడుగుపెట్టారు తాలిబన్లు.. కేపిటల్ సిటీపై పూర్తిస్థాయిలో…
2001 లో ట్విన్ టవర్స్‌పై దాడుల తరువాత అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టాయి. అప్పటి నుంచి రెండు దశాబ్దాలపాటు ఆ దేశంలోని ముష్కరులను మట్టుపెట్టడమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌కు రక్షణ కల్పిస్తూ వచ్చాయి. 20 ఏళ్ల తరువాత ఆ దేశం నుంచి తమ దళాలను వెనక్కి తరలించాలని అమెరికా నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్ వరకు పూర్తిగా దళాలను వెనక్కి తీసుకోవాలని అనుకున్నా, ఆ ప్రక్రియను ముందుగానే పూర్తిచేసింది. ఎప్పుడైతే ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి తగ్గడం మొదలుపెట్టిందో…
తాలిబన్లు 75 శాతానికి పైగా ఆఫ్ఘన్ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాబూల్ మినహా మిగతా భూభాగాలను ఇప్పటికే తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్, ఆఫ్ఘన్ ప్రభుత్వాల మధ్య సంధికి ఖతార్ ప్రయత్నాలు చేస్తున్నది. అధికారాన్ని తాలిబన్లతో కలిసి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఇక, తాలిబన్ల ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని ఇండియాతో సహా 12 దేశాలు స్పష్టం చేశాయి. ఇక ఇదిలా ఉంటే, తాలిబన్ నేతలు ఇండియాపై ప్రశంసలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే మూడోంతుల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు తాజాగా మరో నాలుగు రాష్ట్రాల రాజధాని ప్రాంతాలను సొంతం చేసుకున్నారు. దీంతో దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం రాజధాని కాబుల్ కు 80 కిలోమీటర్ల దూరంలో సైనికులకు, తాలిబన్లకు మధ్య భీకరపోరు జరుగుతున్నది. ఎప్పుడైతే అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవడం మొదలుపెట్టాయో అప్పటి నుంచి తాలిబన్ల ఆగడాలు పెరిగిపోయాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు.…
ఆఫ్గాన్‌లో పరిస్థితి చేయిజారిపోయింది. ఒక్కో నగరం తాలిబన్ల చెరలో చేరిపోతోంది. ఇప్పటికే 34 ప్రొవిన్షియల్ రాజధానుల్లో 10.. తాలిబన్ల వశమయ్యాయి. ఆ దేశంలోని 65 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా లోగర్ ప్రావిన్స్ ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. కందహార్, హెరత్ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన గంటల్లోనే లోగర్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు ప్రకటించారు. తాలిబన్లు చేజిక్కించుకున్న లోగర్ ప్రావిన్స్… ఆ దేశ రాజధాని కాబూల్‌కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికా, నాటో సేనలు…