2001 లో ట్విన్ టవర్స్‌పై దాడుల తరువాత అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టాయి. అప్పటి నుంచి రెండు దశాబ్దాలపాటు ఆ దేశంలోని ముష్కరులను మట్టుపెట్టడమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌కు రక్షణ కల్పిస్తూ వచ్చాయి. 20 ఏళ్ల తరువాత ఆ దేశం నుంచి తమ దళాలను వెనక్కి తరలించాలని అమెరికా నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్ వరకు పూర్తిగా దళాలను వెనక్కి తీసుకోవాలని అనుకున్నా, ఆ ప్రక్రియను ముందుగానే పూర్తిచేసింది. ఎప్పుడైతే ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి తగ్గడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే స్థబ్దతగా ఉన్న తాలిబన్‌లు జూలు విదిల్చాయి. రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘన్‌లోకి కీలక ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. కాందహార్, హెరాత్ వంటి కీలక నగరాలను సొంతం చేసుకున్నాయి. అయితే, రాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకొని తీరుతామని తాలిబన్‌లు చెబుతుండటంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సైనికులను పెద్ద ఎత్తున మోహరించింది. ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు యుద్ధ వాతావరణం వంటి భయానక వాతావరణం లేకుండా చూశామని, ఇప్పటికైనా తాలిబన్లు చర్చకు రావాలని ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఆఫ్ఘన్ సేనలు అమెరికా, నాటో దళాలతో కలిసి పనిచేశాయి. ప్రస్తుతం ఒంటరిగా ఫైట్ చేయాల్సి వస్తున్నది. 20 ఏళ్ల నుంచి జరుగుతున్న అంతర్గత పోరుకు చెక్ పడుతుందా? ఆఫ్ఘన్ సైన్యం తాలిబన్‌లను అడ్డుకొని తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని తీసుకొస్తారా చూడాలి.
Read: ప్రజల మైండ్ సెట్ మారాలి.. మార్పు తీసుకురావాలి: గీతా రెడ్డి