T20 World Cup: ఆరేళ్లయినా ఆ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు!
- అక్టోబర్ 3 నుంచి టీ20 ప్రపంచకప్
- దుబాయ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టనున్న భారత్
- ప్రపంచకప్‌లో హర్మన్ అరుదైన రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harmanpreet Kaur Record in T20 World Cup: అక్టోబర్ 3 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో ఒక్కసారి కూడా విజేతగా నిలవని భారత్.. ఈసారి ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా కప్ సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేరిట టీ20 ప్రపంచకప్‌లో ఉన్న ఓ రికార్డు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన ఏకైక భారత మహిళా క్రికెటర్‌గా హర్మన్ కొనసాగుతున్నారు. ఆరేళ్లయినా ఆ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు.
టీ20 ప్రపంచకప్ 2018లో హర్మన్ ప్రీత్ కౌర్ న్యూజిలాండ్‌పై సెంచరీ చేసింది. గయానాలో జరిగిన ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుంది. మొత్తంగా 51 బంతుల్లో 103 పరుగులు చేసింది. ఇందులో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. హర్మన్ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఏ భారత మహిళా క్రికెటర్ కూడా సెంచరీ చేయలేదు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 2023లో ఐర్లాండ్‌పై 87 పరుగులు, 2018లో ఆస్ట్రేలియాపై 93 రన్స్ చేసింది. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ల్లో హర్మన్ 35 మ్యాచ్‌ల్లో 576 పరుగులు చేసింది. ఎక్కువ సిక్స్‌లు కొట్టిన భారత మహిళా క్రికెటర్‌గానూ ఆమె కొనసాగుతోంది.
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
Also Read: Siddharth-Adithi Rao Hydari: సైలెంట్‌గా పెళ్లిచేసుకున్న అదితి, సిద్ధార్థ్.. ఫోటోస్ వైరల్!
భారత మహిళా జట్టు టీ20 ప్రపంచకప్‌ను ఒక్కసారి కూడా గెలవలేదు. 2020లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ ఫైనల్ చేరి.. రన్నరప్‌గా నిలిచింది. 2018, 2023లో సెమీస్‌కు చేరింది. 2024 ప్రపంచకప్‌లో అయినా భారత్ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అక్టోబర్ 4న దుబాయ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఢీకొట్టనుంది. ఈ ఏడాది భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..