Australia Record in T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన రెండో జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-బీలో భాగంగా ఆంటిగ్వా వేదికగా బుధవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో ఆసీస్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. నమీబియా నిర్ధేశించిన 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 5.4 ఓవర్లలోనే ఛేదించింది. 86 బంతులు…
Australia Beat Enters Super 8 after Beat Namibia: టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన నమీబియాపై ఆస్ట్రేలియా పంజా విసిరింది. ముందుగా బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో చెలరేగి సంచలన విజయం నమోదుచేసింది. ఆంటిగ్వా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నమీబియా నిర్ధేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఒక వికెట్ కోల్పోయి 5.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ విజయంలో ఆడమ్ జంపా (4/12), ట్రావిస్ హెడ్ (34)…
Rohit Sharma, Virat Kohli Misses Team India Practice Session: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పసికూన అమెరికాను ఓడించాలని భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్థాన్, కెనడాను ఓడించిన జోష్‌లో ఉన్న అమెరికా కూడా.. టీమిండియాపై విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ…
8 Indian Players in United States Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్-ఏలో ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా.. హ్యాట్రిక్ విజయంతో పాటు సూపర్-8 బెర్త్ కూడా దక్కుతుంది. దాంతో విజయం కోసమే అమెరికా,…
IND vs USA Prediction and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్-ఏలో బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. భారత్ మాదిరే అమెరికా కూడా ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి జోష్ మీదుంది. పాకిస్థాన్‌కు యూఎస్ఏ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అందుకే భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. అమెరికాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు…
Pakistan 1st Victory in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. మంగళవారం గ్రూప్-ఏ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పనికూన కెనడాపై గెలిచింది. కెనడా నిర్ధేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని పాక్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ బాబర్ అజామ్ (33; 33 బంతుల్లో 1×4, 1×6) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గ్రూప్-ఏలో భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌లలో పాకిస్తాన్ రెండు ఓడి..…
Sanju Samson playing in place of Shivam Dubey: టీ20 ప్రపంచకప్ 2024లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్.. గ్రూప్-ఏ టేబుల్ టాపర్‌గా ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా.. నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఐర్లాండ్‌పై ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్.. పాకిస్థాన్‌పై బౌలర్ల పుణ్యమాని గట్టెక్కింది. భారత్ విజయాలు సాదించిప్పటికీ.. కొందరి ప్లేయర్స్ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో అంచనాలతో బీసీసీఐ ప్రపంచకప్‌కు ఆల్‌రౌండర్ శివమ్ దూబేను…
DRS Controversy in South Africa vs Bangladesh Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓ డీఆర్‌ఎస్ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ‘డెడ్ బాల్ రూల్’ కారణంగా బంగ్లా ఓ బౌండరీని కోల్పోగా.. ఆ నాలుగు పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాకు విజయం దక్కింది. దాంతో డెడ్ బాల్ రూల్…
Team India T20 World Cup Record: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన మొదటి జట్టుగా రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు ఇది 7వ విజయం. దాంతో భారత్ ఖాతాలో ఈ అరుదైన రికార్డు చేరింది. పొట్టి టోర్నీలో…
Jasprit Bumrah on Trolls When He Wad Injured: ఒక్క సంవత్సరం వ్యవధిలోనే తన పట్ల కొందరికి అభిప్రాయం మారిపోయిందని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తన కెరీర్ ముగిసిందన్న వారే.. ఇప్పుడు బుమ్రా సూపర్ అని అంటున్నారన్నాడు. ఎప్పుడైనా తన ముందున్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తా అని బుమ్రా చెప్పుకొచ్చాడు. 2022లో వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. సొంతగడ్డపై పునరాగమనానికి ముందు గాయం తిరగబెట్టడంతో..…