AUS vs NAM: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా!
- నమీబియాపై భారీ విజయం
- టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ చరిత్ర
- అగ్రస్థానంలో శ్రీలంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia Record in T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన రెండో జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-బీలో భాగంగా ఆంటిగ్వా వేదికగా బుధవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో ఆసీస్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. నమీబియా నిర్ధేశించిన 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 5.4 ఓవర్లలోనే ఛేదించింది. 86 బంతులు మిగిలుండగానే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని సాధించింది.
టీ20 ప్రపంచకప్‌లో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన జట్టుగా శ్రీలంక ఉంది. టీ20 ప్రపంచకప్ 2014లో నెదర్లాండ్స్‌పై లంక 90 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. 2021 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 82 బంతులు ఉండగానే గెలిచింది. భారత్ (81 బంతులు, స్కాట్లాండ్‌పై-2021), శ్రీలంక (77 బంతులు, నెదర్లాండ్స్‌పై 2021) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: AUS vs NAM: పసికూనపై పంజా విసిరిన ఆస్ట్రేలియా.. 5.4 ఓవర్లలోనే విజయం!
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌట్ అయింది. గెర్హార్డ్ ఎరాస్మస్ (36; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరి పోరాటం చేశాడు. మైఖేల్ వాన్ లింగేన్ (10) తప్ప మిగతా నమీబియా బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా నాలుగు వికెట్స్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే ఛేదించింది. ట్రావిస్ హెడ్ (34 నాటౌట్; 17 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (20; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు.
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!