Sanju Samson playing in place of Shivam Dubey: టీ20 ప్రపంచకప్ 2024లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్.. గ్రూప్-ఏ టేబుల్ టాపర్‌గా ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా.. నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఐర్లాండ్‌పై ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్.. పాకిస్థాన్‌పై బౌలర్ల పుణ్యమాని గట్టెక్కింది. భారత్ విజయాలు సాదించిప్పటికీ.. కొందరి ప్లేయర్స్ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో అంచనాలతో బీసీసీఐ ప్రపంచకప్‌కు ఆల్‌రౌండర్ శివమ్ దూబేను ఎంపిక చేయగా.. అతడు తీవ్రంగా నిరాశపరిచాడు.
టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైన క్షణం నుంచి శివమ్ దూబే అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. మెగా టోర్నీకి ఎంపికైన తర్వాత ఐపీఎల్ 2024లో వరుసగా రెండుసార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆపై మూడుసార్లు రెండంకెల స్కోరు అందుకున్నా.. అత్యధిక స్కోర్ 21. ప్రపంచకప్‌లో అయినా దూబే రాణిస్తాడనుకున్నా.. అది జరగలేదు. ఐర్లాండ్‌పై 2 బంతులు ఆడి పరుగులేమీ చేయలేదు. అప్పటికే భారత్ విజయం ఖాయం అవ్వడంతో దూబేకు ఆడే అవకాశం రాలేదు. ఇక పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో వచ్చి 9 బంతుల్లో 3 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. పాక్ స్పిన్నర్లను చెడుగుడు ఆడుకుంటాడని అందరూ అనుకున్నా.. సింగిల్స్ తీయడానికి కూడా శ్రమించాడు. ఫీల్డింగ్‌లో నిరాశపరిచాడు.
Also Read: SA vs BAN: గెలిచే మ్యాచ్‌లో ఓటమి.. టీ20 ప్రపంచకప్ 2024లో వివాదం!
అట్టర్ ఫ్లాప్ అవుతున్న శివమ్ దూబే స్థానంలో ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. జూన్ 12న యూఎస్ఏతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో శాంసన్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ 2024లో సంజూ ఇంకా ఆడని విషయం తెలిసిందే. కీపర్‌గా రిషబ్ పంత్ తుది జట్టులో ఉండడంతో సంజూ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. ఐపీఎల్ 2024లో 16 మ్యాచ్‌లు ఆడిన సంజూ.. 15 ఇన్నింగ్స్‌లలో 531 రన్స్ చేశాడు.