సంగీత దర్శకులు తాతినేని చలపతిరావు పేరు వినగానే, ఆయన జానపద బాణీలు మన మదిలో ముందుగా చిందులు వేస్తాయి. తప్పెటపై దరువేస్తూ వరుసలు కట్టడంలో మేటి అనిపించుకున్నారు చలపతిరావు. ఆయన స్వరకల్పనలో అనేక మ్యూజికల్ హిట్స్ రూపొంది జనాన్ని విశేషంగా అలరించాయి. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ చిత్రాలకూ తనదైన శైలిలో స్వరాలు కూర్చి అక్కడి వారి ఆదరణనూ చూరగొన్నారు చలపతిరావు. చలపతిరావు 1920 డిసెంబర్ 22న జన్మించారు. ఆయన కన్నవారు ద్రోణవిల్లి రత్తయ్య, మాణిక్యమ్మ.…