PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన నేడు రాజధాని సిడ్నీలో బిజీ షెడ్యూల్లో గడపనున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. విమానాల సహాయంతో ప్రధానికి స్వాగతం పలికేందుకు ఆకాశంలో 'వెల్‌కమ్ మోడీ' అని రాశారు.
దేశీయ సమస్యల కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పర్యటనను వాయిదా వేసుకోవడంతో వచ్చే వారం సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సమ్మిట్‌ను ఆస్ట్రేలియా బుధవారం రద్దు చేసింది.
ఆస్ట్రేలియాలో మే 24న సమావేశానికి.. క్వాడ్ లో సభ్య దేశాలైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొంటారు.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభించిన 'ఎర్త్ అవర్' కార్యక్రమాన్ని ఈ రోజు రాత్రి 8.30 గంటలకు జరుపుకోనున్నారు. రాత్రి 8.30 గంటలకు ఇళ్లు, కార్యాలయాల్లో ఒక గంట పాటు విద్యుత్ వాడకాన్ని నిలిపివేయనున్నారు.
Qantas flight: నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది.. అయితే, ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోక మునుపే.. పెను ప్రమాదం నుంచి ఓ విమానం బయటపడింది.. వంద మందికి పైగా ప్రయాణికులతో బయల్దేరిన ఓ విమానం.. నడి సముద్రంపై ఉన్న సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. అయితే, ఆ తర్వాత ఆ విమానం సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఈ విమాన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి…
Naked PhotoShoot: అప్పుడే సూర్యుడు ఉదయించేందుకు సిద్ధమవుతున్నాడు. నెమ్మదిగా తెల్లారుతోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద 2,500 మంది నగ్నంగా నిలబడి ఉన్నారు. ఎందుకో అనుకోమాకండి. వాళ్లంతా ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. అయితే వీరు మంచి కాజ్ కోసమే నగ్నంగా ఫోటోలకు పోజులిచ్చారు. వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం 70 సంవత్సరాల వయస్సులోపు ప్రతి ముగ్గురిలో ఇద్దరు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చర్మ…
Australian police identify serial rapist, 40 years after first assault using DNA technology: ఆస్ట్రేలియాలో సీరియల్ రేపిస్టు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏకంగా 15 ఏళ్ల వ్యవధిలో 31 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. అయితే చివరకు టెక్నాలజీ ద్వారా నిందితుడిని గుర్తించారు ఆస్ట్రేలియా పోలీసులు. 40 ఏళ్ల క్రితం తను మొదటిసారిగా మహిళపై అత్యాచారాలను ప్రారంభించాడు. కీత్ సిమ్స్ 1985 నుంచి 2001 మధ్య మొత్తం 31 మంది మహిళలపై లైంగిక…
చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చినట్లే కనిపించినా అప్పుడప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ క్రూజ్ షిప్‌లో 800 కరోనా బాధితులు ఉన్న ఓ క్రూజ్ నౌకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేశారు.
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మరలా విరుచుకుపడుతున్నది. కరోనాకు భయపడి చాలా దేశాలు సరిహద్దులను మూసివేశాయి. విమాన సర్వీసులు నిలిపివేశాయి. జాతీయంగా షరతులతో కూడిన విమానాలను కొంతకాలం పాటు నడిపారు. రష్యాతో పాటుగా కొన్ని దేశాల్లో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉన్నది. మొన్నటి వరకు ఆస్ట్రేలియాలోని కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టింది. 18 నెలలుగా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రస్తుతం తిరిగి పునరుద్దరించింది. రెండు డోసుల…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. రోజుకో కొత్త వేరియంట్ తరహాలో.. ప్రజలను భయపెడుతూనే ఉంది… తాజాగా, డెల్టా వేరియంట్‌తో ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది.. ముఖ్యంగా ఆసీస్‌లోని సిడ్నీ డెల్టా వేరియంట్ దెబ్బకు వణికిపోతోంది.. దీంతో మహమ్మారి కట్టడికోసం కఠినమైన నిబంధనలకు పూనుకుంటుంది ప్రభుత్వం.. ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలను మరోమారు పొడిగించింది. సెప్టెంబర్ చివరి వరకు సిడ్నీలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది ప్రభుత్వం… ఇక కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమల్లో ఉంటుందని వెల్లడించారు.…