క్వాడ్రిలెటరల్ సెక్యూరిటీ డైలాగ్ లీడర్స్ సమ్మిట్ మే 24న ఆస్ట్రేలియాలో జరుగనుంది. 2017 నవంబర్ లో భారత్, జపాన్, యూఎస్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా క్వాడ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్వాడ్ ప్రధాన ఉద్దేశం.. ఇండో-పసిఫిక్ లోని క్లిష్టమైన సముద్ర మార్గాలను ఎటువంటి ప్రభావం లేకుండా ఉంచడానికి.. కొత్త వ్యూహాన్ని అభివృద్ది చేయడానికి, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చటానికి ఏర్పాటైంది. క్వాడ్ మొదటి మీటింగ్ 2021లో అమెరికాలో వర్చువల్ గా జరిగింది. దాని తరువాత 2022లో జపాన్ లోని టోక్యో నగరంలో జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మే 24న మూడో క్వాడ్ సమావేశం జరుగనుంది.
Also Read : Gun Culture : గన్ ఇవ్వండి.. గిఫ్ట్ కార్డు తీసుకోండి..!
ఆస్ట్రేలియాలో మే 24న సమావేశానికి.. క్వాడ్ లో సభ్య దేశాలైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొంటారు. మే 19 నుంచి మే 21 వరకు జపాన్ లో జరిగే జీ7 లీడర్స్ కు హాజరైన తర్వాత మూడవ సారి జరిగే క్వాడ్ లీడర్స్ సమావేశానికి పాల్గొంనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆస్ట్రేలియాకు చేరుకుంటారని వైట్ హౌస్ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
Also Read : Telangana Congress : ఈ నెల 8న తెలంగాణకు ప్రియాంక గాంధీ.. నేడు పార్టీ ముఖ్యులతో థాక్రే సమావేశం
క్వాడ్ సభ్య దేశాల ప్రధాన శత్రువు చైనా.. ఇండో-పసిఫిక్ సముద్ర ప్రాంతంలో చైనా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో క్వాడ్ సభ్య దేశాల ప్రతినిధుల మూడో మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశంలో వాతావరణం, గ్లోబల్ హెల్త్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగి అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ భాగస్వాముల సహాయంతో ప్రాంతం చుట్టూ ఆధునిక సముద్ర డొమైన్ అవగాహన కింద సాంకేతికను అందించడానికి కృషి చేస్తుంది. ఇది చైనాకు మింగుడుపడని ఇష్యూగా మారింది.