విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ 50 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో నాలుగో టీ20లో తమ్మల్ని తామే పరీక్షించుకున్నాం అని చెప్పాడు. త్వరగా వికెట్స్ పడిపోతే.. ఒత్తిడిలో బ్యాటర్లు ఎలా ఆడుతారో తెలుసుకోవాలనుకున్నాం అని తెలిపాడు. ఫలితం కంటే జట్టు సంసిద్ధతకు ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించాడు. టీ20 వరల్డ్‌కప్ 2026ను దృష్టిలో…