T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి కేవలం ఒక రోజు ముందు, భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ మెగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడని సమాచారం. ఫిబ్రవరి 7వ అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఈ బ్యాడ్ న్యూస్ అందింది. ఇటీవల జరిగిన భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లో హర్షిత్ గాయపడ్డాడు, దీనితో ఈ ప్లేయర్ మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. పలు నివేదికల ప్రకారం.. మ్యాచ్ కు ఒక రోజు ముందు రాణా భారత జట్టు నుంచి వైదొలిగాడు.
READ ALSO: Chandrahas Controversy: ఇదేమి ‘యాటిట్యూడ్’ చంద్రహాస్.. మస్త్ ఉందిలే!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయం..
టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులోకి హర్షిత్ రాణా ఎంపికయ్యాడు. అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటాడని అందరూ భావించారు. అయితే ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అతను ఒక ఓవర్ బౌలింగ్ చేసి, తరువాత మైదానం వదిలి వెళ్లవలసి వచ్చింది. అప్పటి నుంచి హర్షిత్ గాయం గురించి జట్టులో ఆందోళన మొదలైంది. కానీ ఇప్పుడు హర్షిత్ రాణా ప్రయాణం ఈ మెగా టోర్నీ ప్రారంభం కాకముందే ముగిసిందని సమాచారం.
పలు నివేదికల ప్రకారం.. హర్షిత్ రాణా పూర్తిగా కోలుకోలేదు. అతని మోకాలి గాయం తీవ్రంగా ఉంది, అందుకే అతను ఇకపై ఈ టోర్నీలో ఆడలేడు. తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘హర్షిత్ రాణా ఇబ్బంది పడుతున్నాడు. ఆ విషయం మాకు ఈ రోజు తెలిసింది. ఒక వేళ హర్షిత్ రాణా జట్టుకు దూరమైతే, అది మాకు పెద్ద నష్టం. మేం వేరే కాంబినేషన్లు ప్రయత్నిస్తాం. అయితే మా రిజర్వ్ బెంచ్ బలంగా ఉంది’ అని పేర్కొన్నాడు.
హర్షిత్ స్థానంలో జట్టులోకి..
భారత జట్టు తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరుగుతుంది. హర్షిత్ జట్టుకు మంచి బౌలింగ్ ఆప్షన్ అందించడమే కాకుండా, బ్యాటింగ్‌లో కూడా అద్భుతంగా రాణించగలడు. అందువల్ల BCCI అతని స్థానంలో ఎవరిని ఎంచుకుంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. హర్షిత్ జట్టులో లేనప్పుడు, టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లలో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే మిగిలి ఉంటారు, మూడవ పేసర్‌గా హార్దిక్ పాండ్యా ఉన్నా ఇంకా ఒక ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది.
READ ALSO: Toxic Telugu Rights: దిల్ రాజు చేతికి ‘టాక్సిక్’.. తెలుగు రైట్స్‌తో యశ్ సృష్టించిన సెన్సేషన్ ఇదే!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!