ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. రేపు శోభాయాత్ర సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాంపల్లి, బేగంబజార్, మోజం జై మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.