Srushti Hospital: సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ పాల్పడిన సృష్టి ఆసుపత్రి గురించి ఇదివరకు అనేక విషయాలు తెలిసాయి. ఆసుపత్రి సంబంధించిన వారు పేద కుటుంబాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసి పేరుతో అమ్మకాలు జరిపేవారు. ఇలా నాలుగేళ్లలో దాదాపు 500 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు అధికారులు. సరోగసి పేరుతో పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి ఏకంగా 50 లక్షల వరకు వసూలు చేసింది సృష్టి ఆసుపత్రి యాజమాన్యం. OYO Room:…
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణలో కేంద్ర క్రిమినల్ సర్వీస్ (CIS) పోలీసులు కీలక వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ను ఒకరోజు కస్టడీకి తీసుకుని వివరమైన విచారణ చేపట్టారు.
Srushti Ivf Center : ఆ ఆడవాళ్లు.. అమ్మతనాన్ని అంగట్లో పెట్టారు. అలాంటి వాళ్లను.. ఆడవాళ్లు అనేకంటే కిరాతకులని చెప్పవచ్చు. 18 మంది ఆడవాళ్లు కలిసి ఏకంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. అమ్మతనం కోసం వెంపర్లాడుతున్న మహిళలు టార్గెట్‌గా చేసుకొని నీచపు దందాకు తెగబడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించారు. డాక్టర్ నమ్రత గ్యాంగ్‌లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. తల్లితనం కోసం తల్లడిల్లుతున్న వారిని టార్గెట్ చేసుకుని.. IVF పేరుతో ఆ తర్వాత సరోగసీ పేరుతో…
Srushti Fertility Scam : హైదరాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ నమ్రతపై ఘోర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పేద దంపతుల వద్ద ఫ్రీగా ఆడపిల్లలను తీసుకుని, సరోగసి పేరుతో విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆడపిల్లలను పెంచే ఆర్థిక స్థోమత లేని కుటుంబాల నుండి ఏజెంట్ల సహకారంతో పిల్లలను సేకరించిన నమ్రత, మగ పిల్లలయితే ఒక్కొక్కరిని లక్ష రూపాయలకు కొనుగోలు చేసి సరోగసి పేరుతో అమ్మినట్లు సమాచారం. డాక్టర్ నమ్రత దగ్గరకు…
Srushti Case: హైదరాబాద్‌లో సృష్టి ఫెర్టిలిటి సెంటర్ నిర్వాహకురాలు నమ్రతపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, ఇప్పుడు ఆమెను కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 86 మంది సరోగసీ దంపతుల వివరాలను సేకరించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.…
Srushti IVF: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సృష్టి కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ మహిళలే కావడం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు. దర్యాప్తు వివరాల ప్రకారం, అరెస్టయిన ఈ ముగ్గురు మహిళలు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. శిశువుల క్రయ విక్రయాలలో వీరు నమ్రతకు నేరుగా సహకరించారు. ఈ సేవలకు…
Srushti Case : సృష్టి ఫెర్టిలిటీ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో గోపాలపురం పోలీసులు బుధవారం ఆమెను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ ముమ్మరంగా సాగింది. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ పేరుతో పిల్లల విక్రయాలు అనే తీవ్ర ఆరోపణలపై అడిగిన ప్రశ్నలకు డాక్టర్ నమ్రత తగిన సమాధానాలు ఇవ్వలేదు. చాలాసార్లు ఆమె నోరుమెదపక…
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రత ను కస్టడీలోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. సికింద్రాబాద్ కోర్టు 5రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్ గూడా జైలు నుంచి ఏ1 నమ్రత ను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. ఈనెల 5 వరకు డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీలోనే ఉండనుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ విశాఖపట్నం మేనేజర్ కల్యాణి అచ్చయమ్మ వ్యవహారాలపై విచారించనున్నారు పోలీసులు. Also Read:Karnataka: నెల జీతం 15…
డబ్బు మాయలో పడి పవిత్రమైన వైద్య వృత్తికి కలంకం తెచ్చారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆసుపత్రి వైద్యులు. సంతానం లేని దంపతులను నిండా ముంచి లక్షలు కాజేసి మానసిక క్షోభకు గురిచేశారు. పిల్లలు లేని లోటును తీర్చుకోవాలనే ఆరాటంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సంప్రదించడమే వారు చేసిన తప్పైపోయింది. ఎవరో వ్యక్తుల స్పెర్మ్, అండాలు సేకరించడం, వాటి ద్వారా పిండాలను సృష్టించడం, ఐవిఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు…
Shocking Fertility Scam Uncovered: సంతాన సాఫల్యం అనే పవిత్రమైన పని చేస్తున్నామని బయటకు చెప్పుకుంటూ నీచపు దందా చేస్తున్నాయి కొన్ని సంస్థలు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ దందా వెలుగులోకి రావడంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ చేస్తున్న గలీజ్ దందా బయటకు వచ్చింది. బిచ్చగాళ్లకు బిర్యానీ ఇచ్చి వీర్యం సేకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అంతే కాదు అడ్డా కూలీ మహిళల నుంచి అండాలు సేకరించినట్లుగా బయటపడింది.…