సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఐవిఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఐ వి ఎఫ్ అయితే రెండు మూడు లక్షలు మాత్రమే వస్తాయని భావించింది నమ్రత.. సరోగసి అయితే దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి వసూలు చేయొచ్చని భావించింది. సరోగసి కోసం 30 నుంచి 50 లక్షల రూపాయలను వసూలు చేసింది నమ్రత. ఇప్పటికే 30 మందికి పైగా సరోగసి కోసం డబ్బులు కట్టినట్లు గుర్తించారు.…
DCP Rashmi Perumal : సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ క్లినిక్‌పై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి పేరుతో అక్రమ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందని పోలీసులు స్పష్టంచేశారు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. సృష్టి క్లినిక్‌లో సరోగసి పద్ధతిలో బిడ్డను కల్పిస్తామని చెబుతూ, వాస్తవానికి వేరే మహిళకు పుట్టిన బిడ్డను ఇవ్వడం ద్వారా దంపతులను మోసం చేశారని పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఒక…
Srushti Testtube Baby Centre: సికింద్రబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. చట్టవ్యతిరేక సరోగసి విధానాలు, పిల్లల అక్రమ విక్రయం వంటి అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో డాక్టర్ నమ్రత ప్రధాన పాత్రధారిగా మారగా, ఆమె ఆధ్వర్యంలో సరోగసి కోసం వచ్చిన దంపతులకు వేరే పిల్లలను ఇవ్వడానికి ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత గోపాలపురంలోని ఓ జంట…
హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో జరిగిన ఓ దారుణ ఘటన సామాన్యులను కలవరపెడుతోంది. సంతానం కోసం ఆశతో వచ్చిన దంపతులను మోసం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు.…
మెడికల్ మాఫియాకు హద్దులు లేకుండా పోతున్నాయి. వైద్యులు దేవునితో సమానం అని జనం నమ్మి వస్తే.. తాము ఏం చేసినా చెల్లుతుందనే రీతిలో మెడికల్ మాయగాళ్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఓ టెస్ట్ ట్యూబ్ సెంటర్ చేసిన నిర్వాకం.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి వారు చేసే బాగోతాన్ని బయటపెట్టింది. అసలు ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఏం జరిగింది? పోలీసుల సోదాల్లో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? పిల్లలు లేని దంపతుల బాధ వర్ణనాతీతం.. పిల్లలు…