Shocking Fertility Scam Uncovered: సంతాన సాఫల్యం అనే పవిత్రమైన పని చేస్తున్నామని బయటకు చెప్పుకుంటూ నీచపు దందా చేస్తున్నాయి కొన్ని సంస్థలు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ దందా వెలుగులోకి రావడంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ చేస్తున్న గలీజ్ దందా బయటకు వచ్చింది. బిచ్చగాళ్లకు బిర్యానీ ఇచ్చి వీర్యం సేకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అంతే కాదు అడ్డా కూలీ మహిళల నుంచి అండాలు సేకరించినట్లుగా బయటపడింది. ఈ సంస్థకు చెందిన బ్రోకర్లు రంగంలోకి దిగారంటే అంతే. యువకులకు మాయమాటలు చెప్పి వీర్యాన్ని సేకరించేస్తారు. జస్ట్ వాళ్లకు బీరు, బిర్యానీ ఆశ చూపించి వీర్యాన్ని సేకరిస్తున్నారంటే ఈ బ్రోకర్లు మాములోళ్లు కాదు. ఐతే వారు ముందుగా హెల్దీగా ఉన్న వారిని మాత్రమే టార్గెట్ చేస్తారు. వారిని తమ మాటలతో ముగ్గులోకి దింపుతారు. ఆ తర్వాత వారికి ఫ్రీగా బిర్యానీ ఇప్పిస్తారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పి.. డబ్బు ఆశ చూపిస్తారు. వీర్యం ఇస్తే రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు వస్తాయని చెప్పి బుట్టలో వేస్తున్నారు. వారి నుంచి వీర్యం సేకరించడానికి పోర్న్ వీడియోలు చూపించినట్లు తెలుస్తోంది.
READ MORE: Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా?.. పీఎస్ ముందు మందుబాబు ఆత్మహత్యాయత్నం!
పురుషుల నుంచి వీర్యం సేకరించినట్లే.. మహిళల నుంచి కూడా అండాలు సేకరిస్తున్నారు. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ. ఐనప్పటికీ అమాయకులైన మహిళలను బుట్టలో వేసుకుని వారికి డబ్బు ఆశ చూపించి వారి నుంచి అండాలు సేకరిస్తున్నారు. ఇలా ఇచ్చిన వారికి రూ. 30వేల నుంచి రూ. 50వేల వరకు చెల్లిస్తున్నారు. కొన్నిసార్లు రోజువారీ కూలీలు, యాచకులు, పాదచారుల దగ్గర నుంచి కూడా వీర్యం, అండాలు సేకరించినట్లుగా బయటపడింది. ఇక ఇలా అక్రమంగా సేకరించిన వీర్యం, అండాలను చెడిపోకుండా ఫ్రీజర్ బాటిళ్లలో ఉంచి గుజరాత్‌కు ఫ్లైట్‌లో తరలిస్తున్నారు. అక్కడి నుంచి మళ్లీ దేశవ్యాప్తంగా చాలా ఫర్టిలిటీ సెంటర్లకు వాటిని అధిక ధరకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు.. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసు నేపథ్యంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థలో పోలీసులు, వైద్యారోగ్య శాఖ అధికారులు దాడి చేయడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి. దీంతో పోలీసులు ఈ సంస్థను సీజ్ చేశారు. మొత్తంగా ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
READ MORE: Rajasaab : రాజాసాబ్ సెట్స్ లో పూరీ.. ప్రభాస్ లుక్స్ చూశారా
ఇక సికింద్రాబాద్‌లోని ఇండియన్ స్పెర్మ్ టెక్‌కు వీర్యం, అండాల సేకరణకు ఎటువంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. అయితే క్లినిక్ యాజమాన్యం తమకు అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతోంది. ఈ క్రమంలో బృందాలను అహ్మదాబాద్ పంపి లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మరోవైపు సరోగసీ పేరుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రత చేసిన ఆర్గనైజ్‌డ్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. ఆమెకు చెందిన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ల బ్రాంచీలలో గతేడాది కాలంలోనే 30 సరోగసీ కేసులు చేసినట్లు రికార్డుల్లో లభ్యమయ్యాయి. కానీ వాటి ఆనవాళ్లు మాత్రం లభ్యం కాలేదని పోలీసులు చెబుతున్నారు. ఆదివాసీలు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పిల్లలను కొనుగోలు చేసి సరోగసీ చేయించుకున్న దంపతులకు అమ్మేసినట్లు బయటపడింది. ఒక్కో బిడ్డ కోసం రూ. 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు గిరిజనులకు బిడ్డ కోసం కేవలం వేల రూపాయల్లో చెల్లింపులు చేసేవారని బయటపడింది.
READ MORE: AP High Court: హైకోర్టులో కొడాలి నాని, వైసీపీ నేతలకు రిలీఫ్.. పోలీసులపై న్యాయస్థానం సీరియస్
డాక్టర్ నమ్రత లీలలు అన్నీ ఇన్నీ కావు. దేశవ్యాప్తంగా ఆమెకు చాలా నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆశా వర్కర్ల ద్వారా గర్భిణుల వివరాలు సేకరించడం.. వారికి ఉచితంగా ప్రసవం చేయిస్తామని తీసుకు రావడం.. ఆ తర్వాత కొంత మొత్తం ఇచ్చి పిల్లలను కొనుగోలు చేసేదని చెబుతున్నారు. అలా సేకరించిన పిల్లలను ధనవంతులకు విక్రయించి సొమ్ము చేసుకునే నీచపు దందా చేసింది డాక్టర్ నమ్రత. అంతే కాదు కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు బర్త్ సర్టిఫికెట్లు కూడా సృష్టించింది. బహుశా.. ఆమె సెంటర్‌కు పెట్టుకున్న సృష్టి పేరు అదే కావొచ్చంటున్నారు. ఇలా ఒక్క విశాఖ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లోనే సగటున ఏడాదికి 50 వరకు శిశు జననాలు చేసి విక్రయించినట్లు తెలుస్తోంది. డాక్టర్ నమ్రత కొడుకు న్యాయవాదిగా పని చేస్తున్నాడు. అతన్ని అడ్డం పెట్టుకుని నమ్రత అక్రమాలు కొనసాగించినట్లు సమాచారం. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే.. మరిన్ని అరాచకాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు..