నేడు రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు. ఈ ఉదయం 8 గంటల నుంచి మొదలయిన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో భాగం అయిన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం సభ్యులు 3,355 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. అధ్యక్ష కార్యదర్శిల తో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు…
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల స్థాయిలోనే ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఎన్నికలు ఇండస్ట్రీలో సెగలు పుట్టిస్తున్నాయనే చెప్పాలి. రేపు జరగనున్న ఈ పోలింగ్ కోసం అటు యాక్టివ్ నిర్మాతలు, ఇటు ఒకప్పటి నిర్మాతలు రెండు వర్గాలుగా విడిపోయి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రధానంగా రెండు ప్యానెళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ Vs మన ప్యానెల్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు మంగళవారం నాడు గ్లోబల్ సమ్మిట్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు సంబంధించి ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సహా మెగాస్టార్ చిరంజీవి, నటులు జెనీలియా, అక్కినేని అమల…
Film Chamber : ఫిలిం ఛాంబర్ వద్ద సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో మురళీ మోహన్, సురేష్ బాబు, శివాజీ రాజా, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నరసింహారావు, శివనాగేశ్వరరావు, చంటి అడ్డాల తదితరులు పాల్గొన్నారు. ఆనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాదుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఫిలిం నగర్ సోసైటీలో…
Mirai VFX : టీజీ విశ్వప్రసాద్‌కు తెలుగులో ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్‌ఆర్‌ఐగా తెలుగు సినిమా మీద ఆసక్తి పెంచుకున్న ఆయన, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా 50 సినిమాలు దాదాపు పూర్తి చేశారు. అందులో కొన్ని వేరే నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన సినిమాలైతే, చాలా వరకు ఆయన సొంత ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. నిజానికి ఆయన సినీ పరిశ్రమలో చాలా నష్టాలు ఎదుర్కొన్నారు. అయినా, మరోపక్క ఇతర బిజినెస్‌లు చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2తో పాటు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాల రిలీజ్ సందర్భంగా మన తెలుగు సినీ నిర్మాతల రెండు నాలుకల ధోరణి బయటపడింది. నిజానికి సినిమా థియేటర్లకు ఎవరూ రావడం లేదు, సినీ పరిశ్రమ ఇలా అయితే ఇబ్బంది పడుతుంది, థియేటర్లు మూతపడతాయంటూ బాధపడిన నిర్మాతలే ఇప్పుడు ఈ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వార్ * సినిమాని నాగవంశీ రిలీజ్ చేస్తుంటే, కూలీ సినిమాని ఏషియన్ సునీల్, సురేష్…
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో పర్సంటేజీ విధానం లెక్కన సినిమాలాడించాలా లేక రెంటల్ విధానం లెక్కన ఆడించాలా అనే విషయం మీద కొన్ని ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లందరూ ఖచ్చితంగా పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ఆడించాలని లేదంటే థియేటర్లో మూసేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు అయింది. Also Read:Icon Movie : బన్నీ వదిలేసిన ‘ఐకాన్’.. కొత్త హీరో అతనేనా..? ఈ కమిటీలో సభ్యులుగా కేఎల్…
జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తూగో జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఇదంతా దిల్ రాజు కుట్రలో భాగమని ఆరోపించారు. సినిమా థియేటర్ల బంద్ విషయంలో తన పేరును దురుద్దేశంతో లాగారని, ఈ వివాదం వెనుక దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్…
తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి రెంట్ (అద్దె) విధానం, పర్సంటేజ్ (షేరింగ్) విధానంపై ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య మొదలైన వివాదం అనేక మలుపులు తిరుగుతూ వెళ్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ప్రస్తుతం రెంటల్ విధానంపై ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ విధానంలో నిర్మాతలు థియేటర్లకు నిర్ణీత అద్దె చెల్లించి సినిమాలను ప్రదర్శిస్తారు. అయితే, కలెక్షన్లు తక్కువగా ఉన్నప్పుడు థియేటర్లు షోలను రద్దు చేయడం లేదా మూసివేయడం వంటి…