తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు మంగళవారం నాడు గ్లోబల్ సమ్మిట్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు సంబంధించి ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సహా మెగాస్టార్ చిరంజీవి, నటులు జెనీలియా, అక్కినేని అమల మరియు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తెలంగాణను ఒక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Also Read:Akhanda 2 : అఖండ ఆగమనం..తప్పుకుంటున్న సినిమాలివే!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని వివరించారు. సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా, 24 క్రాఫ్ట్స్‌లో స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సినీ ప్రముఖులకు ముఖ్యమంత్రి సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని సీఎం తెలిపారు. సినీ బృందాలు స్క్రిప్ట్‌తో వస్తే, సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Also Read:Love Insurance Kompany: ఒకే ఏడాది 300 కోట్ల రికార్డ్ మిస్సయిన ప్రదీప్ రంగనాథన్
మొత్తం మీద, ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందేందుకు, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన మరియు స్థానిక నైపుణ్యాలను పెంచే విషయంలో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించగలదని భావిస్తున్నారు. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హెలికాఫ్టర్ లో రావడం విశేషం.