సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుపై ఆయన సోదరుడు, టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ అభిమానులు ట్రోలింగ్ మొదలెట్టారు. సురేష్ బాబుపై వారు చాలా ఆగ్రహంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. తమ అభిమాన నటుడు నటించిన రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేయబోతున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఆ రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2”. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికే డైరెక్ట్-డిజిటల్ రిలీజ్ కోసం…
గత కొన్ని రోజులుగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెడుతోందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో నూరు శాతం వాస్తవం ఉందని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ప్రకటించారు.”1964లో డా. రామానాయుడుచే స్థాపించబడిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ జాతీయ సినిమాకు 50 ఏళ్ళకు పైగా సహకారం అందించిన భారతదేశపు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా అవతరించిన విషయం తెలిసిందే. ఎక్కువ సంఖ్యలో భారతీయ భాషల్లో సినిమాలు…
విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ లో రూపొందుతున్న పీరియాడికల్ డ్రామా ‘నారప్ప’. తమిళంలో భారీ హిట్ కొట్టిన ‘అసురన్’కు రీమేక్ గా తెరకెక్కుతోంది ‘నారప్ప’. తాజాగా సురేష్ బాబు ‘నారప్ప’లో కొన్ని మార్పులను సూచించాడట. ‘నారప్ప’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో ఇటీవలే మాట్లాడిన సురేష్ బాబు ఫైనల్ కట్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులను సూచించారట. కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమన్నారట. ఇక ‘నారప్ప’కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియమణి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ…