Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఖమేనీ రెండవ పెద్ద కుమారుడు, మోజ్తాబా ఖమేనీ (55) అతని తర్వాత సుప్రీంలీడర్‌గా ఎన్నికలయ్యే అవకాశం కనిపిస్తోంది.