AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో గోవిందప్ప, ధనజయ్ రెడ్డి, కృష్ణారెడ్డిలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ సందర్భంగా సరెండర్ నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ వరకు సరెండర్ కావాల్సిన అవసరం లేదని సిట్ కు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చెయ్యాలని సిట్ కు ఆదేశాల్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 15వ తేదీ వరకు వాయిదా వేసింది.
Read Also: CM Chandrababu: చాయ్‌వాలా దేశానికి ప్రధాని కావడం అనేది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం..
ఇక, ఏపీ లిక్కర్ కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిల బెయిల్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం.. నిందితుల తరఫున సీనియర్ అడ్వకేట్ ఆర్యమాసుందరం, నిరంజన్ రెడ్డిలు వాదనలు వినిపించారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా, ముకుల్ రోహిత్ వాదనలు వినిపించారు.