దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాది కపిల్ సిబల్ సహా సీనియర్ న్యాయవాదులను మేము ఈ కేసు కోసం నియమించామని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టే పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ హైకోర్టు తుది తీర్పులకు లోబడి ఉంటుందని కోర్ట్ స్పష్టం చేసిందన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్నారు కాబట్టి వాటిని వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు భావించిందన్నారు. పరీక్షలు నిర్వహిస్తే నిర్వహించారు, ఫలితాలను మాత్రం ప్రకటించవద్దు అంటూ సుప్రీంకోర్టు ఇవాళ్టి ఆదేశాల్లో పేర్కొందని, ఫలితాలు వెల్లడించినా సరే.. నియామకాలు తుది తీర్పులకు లోబడి ఉంటాయని తెలంగాణ హైకోర్టు చెబితే, తుది తీర్పు ఇచ్చిన తర్వాతనే ఫలితాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు దాసోజు శ్రవణ్.
Nandigam Suresh: మహిళ హత్య కేసు.. మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు 14 రోజుల రిమాండ్!
నియామకాలు జరిగి ఉద్యోగాల్లో చేరిన తర్వాత వచ్చే తుది తీర్పు కంటే, ముందే తుది తీర్పు ఇవ్వడం వల్ల జరగబోయే నష్టాన్ని నివారించవచ్చని, ఈ రకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల మేము సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. జీవో 55లో 1:50 ప్రకారం షార్ట్ లిస్ట్ చేయాలి. జీవో 29 ప్రకారం కూడా 1:50 అని చెబుతున్నప్పటికీ… అంత కంటే ఎక్కువ మందిని మెయిన్స్ పరీక్షలకు క్వాలిఫై చేశారని, ఓపెన్ కేటగిరిలో రిజర్వుడ్ వర్గాలను రాకుండా చేయాలన్న కుట్రతోనే రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఇదంతా చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ ఓపెన్ క్యాటగిరిలో మెరిట్ కలిగిన రిజర్వుడు అభ్యర్థులకు చోటు ఉంటుందని నోటికి మాటలు చెబుతున్నారని, కానీ దాన్ని నిరూపించే పత్రాలు ఏమీ లేవు. పారదర్శకత అసలే లేదన్నారు. కట్ ఆఫ్ మార్కులు ఎక్కడా కూడా ప్రచురించలేదని, పారదర్శకత లేనప్పుడే గూడుపుఠాణి జరిగిందని అందరికీ అనుమానాలు కలుగుతాయన్నారు దాసోజు శ్రవణ్.
Ganderbal Terror Attack: ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకమైంది: రాహుల్ గాంధీ