భారత ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్ పర్యటన పెద్ద చర్చగా మారింది.. మోడీ భద్రతా ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రధాని మోడీ భద్రతలో ఎలాంటి ఉల్లంఘన జరగకుండా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్.. మరోవైపు, పిటిషన్ కాపీని కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్ సర్కార్‌కు కూడా అందించాలని న్యాయవాది మణిందర్ సింగ్‌కు సూచించింది సుప్రీంకోర్టు.. ఇదే సమయంలో.. ఇవాళ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. ఇక, ఇవాళ సీజేఐ ఎన్వీ రమణ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నారు.
Read Also: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. వరుసగా పడిపోతున్న ధరలు
మరోవైపు ప్రధాని మోడీ భద్రత ఉల్లంఘన అంశంపై విచారణకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది పంజాబ్ సర్కార్. మూడురోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక, ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై కేంద్ర మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించారు. పాకిస్థాన్ సరిహద్దులో బీజేపీ సభలో పాల్గొనేందుకు బుధవారం రోడ్డు మార్గాన వెళ్తున్న ప్రధాని కాన్వాయ్‌కు రైతు ఉద్యమకారులు అడ్డుతగిలిన విషయం తెలిసిందే. దాంతో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు జాతీయ రహదారిపై నిలిచిపోయింది. ప్రధాని వెంటనే తన పర్యటనను రద్దు చేసుకొని.. వెనక్కి తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు ఆ తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు.. ఇదే సమయంలో.. తనను ప్రాణాలతో వెనక్కి పంపినందుకు పంజాబ్ సీఎంకు కృతజ్ఞతలని విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రధాని మోడీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్నే రేపుతోంది..