Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. అయ్యన్నపాత్రుడుపై ఫోర్జరీ కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.. ఈ కేసులో జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.. ఫోర్జరీ సెక్షన్లు ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. కేసు దర్యాప్తు సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై…
AIADMK Leadership row: తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐడీఎంకే పార్టీ చీఫ్ గా పళనిస్వామి ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఉంటారని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే పార్టీపై తన అధిపత్యాన్ని నిలుపుకోవడానికి పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్ థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
పోలీసు స్టేషన్లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను నెల రోజుల్లోగా పాటించాలని సూచించింది.
Amara Raja Batteries: అమర రాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంలో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తివేసింది సుప్రీంకోర్టు.. అమర రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని.. పరిసర ప్రాంతాల జలాల్లో లెడ్ కంటెంట్ పెరిగిందని గతంలో నోటీసులు ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి.. 34 సార్లు నోటీసులు ఇచ్చి రాజకీయ కారణాలతో…
Delhi Mayor Elections: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు భారీ విజయం దక్కింది. మేయర్ ఎన్నికపై సుప్రీం కీలక తీర్పు వెల్లడించింది. లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన సభ్యులు ఓటేయరాని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. మేయర్ ఎన్నికపై బీజేపీ, ఆప్ మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి పలు ట్విస్ట్లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. దీంతో..నేడు సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.