Supreme Court: అక్రమ మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలే వరకు ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారణ చేయవద్దన్న తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.
R. Krishnaiah: రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కంచె గచ్చిబౌలి భూమి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, అల్ ఇండియా ఓబీసీ…
కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత రేషన్‌ను ప్రజలకు ఎప్పటి వరకు పంపిణీ చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఉచిత రేషన్‌కు బదులుగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీసింది.
మనుషుల్లో పెరుగుతున్న పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలిచిన ఘటన జవహర్ నగర్ లో చోటుచేసుకుంది. వీధికుక్కలపై కర్రలతో దాడి చేసిన దుండగులు వాటిని చిత్ర హింసలకు గురిచేసి చంపారు.