Telangana Government: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 3 అధునాతన ఆస్పత్రుల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. 2 వేల కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్టులకు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డును అందజేసింది. సనత్ నగర్, ఎల్‌బీ నగర్, ఆల్వాల్ ఏరియాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టేందుకు 3 నిర్మాణ సంస్థలను ఎంపిక చేసింది. ఈ ఆస్పత్రులను టిమ్స్ అనే పేరుతో పిలుస్తారు.
వరంగల్ దశ తిరగనుందా? ఓరుల్లు ఇక హెల్త్ సిటీగా రూపుదిద్దుకోనుందా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఎంతో చారిత్రక నేపథ్యం వున్న వరంగల్ నగరంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మాణానికి సంబంధించి జీవో విడుదలైంది. 15 ఎకరాల్లో 1,100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలకు అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. 24 ఫ్లోర్లతో భారీ భవన సముదాయం, 2,000 పడకలు ఇక్కడ ఏర్పాటుచేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ కోసం…