మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న కోల్‌కతా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. టాపార్డర్ సహా మిడిలార్డర్ బ్యాట్స్మన్లందరూ పెద్దగా ఆశాజనకమైన ప్రదర్శన కనబర్చకపోవడంతో.. కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ, రసెల్ రాకతో ఆ ఊహాగానాలన్నీ తారుమారు అయ్యాయి. అప్పటివరకూ కోల్‌కతా బ్యాట్స్మన్లకు…
సాధారణంగా క్రికెట్లో గోల్డెన్ డక్ అంటే అందరికీ తెలుసు.. కానీ డైమండ్ డక్ అంటే చాలా మందికి తెలియదు. అయితే ఆదివారం సన్‌రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ చూసిన వాళ్లకు డైమండ్ డక్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ డైమండ్ డక్ అయ్యాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే అవుటైతే దానిని డైమండ్ డక్ అంటారు. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మతో సమన్వయ లోపం కారణంగా విలియమ్సన్ ఖాతా…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. అతడు ఈ టోర్నీలో గోల్డెన్ డకౌట్ కావడం ఇది మూడోసారి. అయితే మరో ఓపెనర్ డుప్లెసిస్ మాత్రం మెరుపు వేగంతో ఆడాడు. 50…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. 208 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 186 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. నికోలస్ పూరన్(62), మార్క్రమ్(42) రాణించినా రన్‌రేట్ పెరిగిపోవడంతో సన్‌రైజర్స్‌కు మరో ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఈరోజు ఐపీఎల్లో 50వ మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అందరూ అనుకున్నట్లే ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన పాత టీమ్ సన్‌రైజర్స్‌పై చెలరేగి ఆడాడు. మరో ఓపెనర్ మన్దీప్ సింగ్ డకౌట్‌గా వెనుతిరిగినా వార్నర్ మాత్రం కళ్లు చెదిరేలా బ్యాటింగ్ చేశాడు. 58 బంతుల్లో 12…
ఐపీఎల్లో ఈరోజు ఆసక్తికర సమరం జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే గతంలో 9 ఏళ్ల పాటు సన్‌రైజర్స్ జట్టులో ఆడిన డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. 9 ఏళ్ల పాటు సన్‌రైజర్స్ జట్టుతో ఆడటం వల్ల ఆ జట్టుతో వార్నర్‌కు మంచి అనుభవం ఉంది. కానీ గత ఏడాది అవమానకర రీతిలో వార్నర్‌కు తుదిజట్టులో కూడా చోటు దక్కలేదు. మేనేజ్మెంట్తో తారాస్థాయికి చేరిన విభేదాల…
ఐపీఎల్లో వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మరోసారి గాయపడటంతో తర్వాతి మ్యాచ్‌లో అతడు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని హెడ్ కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు. గతంలో సుందర్‌కు గాయమైన కుడి చేతికే మరోసారి గాయమైందని తెలిపాడు. గాయం కారణంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సుందర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకుండానే మైదానాన్ని విడిచివెళ్లాడు. కాగా టోర్నీ ప్రారంభంలో…
పూణె వేదికగా ఆదివారం రాత్రి ఐపీఎల్లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్లు రుతురాజ్ గైక్వాడ్ (99), కాన్వే (85 నాటౌట్) మెరుపుల కారణంగా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అయితే చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు…
ఐపీఎల్లో మరోసారి బ్యాటింగ్‌లో సత్తా చాటింది సన్‌రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ టైటన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది… 65 పరుగులతో అభిషేక్ శర్మ, 56 పరుగులతో ఎయిడెన్ మార్క్రమ్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. చివరి ఓవర్లు శశాంక్ సింగ్ 6 బంతుల్లో 25 పరుగులు చేసి సత్తా చాటలాడు.. లోకీ ఫెర్గూసన్ వేసిన చివరి ఓవర్లో శశాంక్ దెబ్బకు ఏకంగా 25 పరుగులు రావడం కూడా ఎస్ఆర్హెచ్ భారీ…
ఐపీఎల్ 2022 సీజన్లో ఈ రోజు మరో ఆసక్తికర పోటీ జరుగనుంది. నాలుగు విజయాలతో దూసుకుపోతున్న ఎస్ఆర్హెచ్ పట్టిష్టమైన ఆర్సీబీతో తలపడనుంది. ముంబైలోని బ్రబోర్న్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిని ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్‌ను ఎంచుకుంది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా, సన్‌రైజర్స్.. 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. గత…