ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, అభినవ్ మనోహర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయ్యారు. హార్ధిక్ పాండ్యా 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మనోహర్ 35, మాథ్యూ వేడ్ 19 పరుగులు చేశారు. సన్ రైజర్స్…
వీకెండ్ సందర్భంగా ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు టోర్నీలో బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి చెన్నై హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. సన్‌రైజర్స్ టీమ్ కూర్పుపై విమర్శలు వస్తుండటంతో ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విలియమ్సన్…
ఐపీఎల్లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన తమ జట్టును ఓపెనర్ కేఎల్ రాహుల్ (68), ఆల్‌రౌండర్ దీపక్ హుడా (51) హాఫ్ సెంచరీలతో రాణించి తమ జట్టుకు మంచి స్కోరు అందించారు. కేఎల్ రాహుల్ 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 68 పరుగులు చేశాడు. దీపక్ హుడా 33 బంతుల్లో…
ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 210/6 స్కోర్ చేయగా.. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైన విధానంపై దుమారం రేగుతోంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో విలియమ్సన్ క్యాచ్ అవుట్ అయ్యాడని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే…
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ రోజు ఐపీఎల్ -2022లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతున్నాయి. అయితే టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బాట్స్‌తో తొలుత బరిలోకి దిగి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో సన్…
క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూసే ఐపీఎల్ సీజన్ మొదలైంది. ఈ ఏడాది కూడా ఎంతో ఉత్సాహంతో క్రికెట్ అభిమానుల ముందుకు వచ్చేసింది. అయితే పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ రోజు ఐపీఎల్ -2022లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతున్నాయి. అయితే టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బాట్స్‌తో తొలుత బరిలోకి దిగి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి…
మరో వారం రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని జట్లు మైదానంలోకి అడుగుపెట్టి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో ఇంకా బాధపడుతున్నాడని.. అతడు ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతోంది. గత ఏడాదితో భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ఫిట్‌గా లేడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే సన్‌రైజర్స్…
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 15 ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. అసిస్టెంట్ కోచ్ పదవికి సైమన్ కటిచ్ రాజీనామా చేశారు. ఇటీవల ఐపీఎల్ ఆటగాళ్ల కోసం జరిగిన మెగా వేలం పాటలో ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. యాజమాన్యంతో విభేదాలు వచ్చినందుకే సైమన్ కటిచ్ జట్టును వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన ‘ది ఆస్ట్రేలియన్’…
త్వరలో ఐపీఎల్-15 ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇటీవల ఐపీఎల్ మెగా వేలం కూడా పూర్తయింది. అయితే సన్‌రైజర్స్ కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని.. ఈ మేరకు ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో అన్న అనుమానాలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందో సూచన ప్రాయంగా చెప్పేశాడు. కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్‌కు వస్తారని… ఆ…
రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్-2022 మెగావేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 67 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 204 మంది ఆటగాళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.551.7 కోట్లను ఖర్చు చేశాయి. ఈ ఐపీఎల్ వేలంలో ఇషాన్ కిషన్ అత్యధిక ధర పలికాడు. అతడి కోసం ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లను ఖర్చు చేసింది. రెండో స్థానంలో దీపక్ చాహర్ నిలిచాడు. అతడిని చెన్నై సూపర్‌కింగ్స్…