ఐపీఎల్‌లో మరోసారి బ్యాటింగ్‌లో సత్తా చాటింది సన్‌రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ టైటన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది… 65 పరుగులతో అభిషేక్ శర్మ, 56 పరుగులతో ఎయిడెన్ మార్క్రమ్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. చివరి ఓవర్లు శశాంక్ సింగ్ 6 బంతుల్లో 25 పరుగులు చేసి సత్తా చాటలాడు.. లోకీ ఫెర్గూసన్ వేసిన చివరి ఓవర్లో శశాంక్ దెబ్బకు ఏకంగా 25 పరుగులు రావడం కూడా ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోర్‌కు సకహరించింది.. ఇక, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5), రాహుల్ త్రిపాఠీ (16) పరుగులు చేయగా.. మార్కో జాన్సెన్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.. గుజరాత్ బౌలర్లలో షమీ 3 వికెట్లతో చెలరేగగా, యష్ దయాళ్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.. మొత్తంగా 196 పరుగుల భారీ టార్గెట్‌ను గుజరాత్ ముందు ఉంచింది హైదరాబాద్.
Read Also: Munnur Ravi: టీఆర్‌ఎస్ ప్లీనరీలో కలకలం.. మున్నూరు రవి ప్రత్యక్షం..