South Africa T20 League: ఇండియాలోని ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను భారీగా నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఆరు జట్లు ఆటగాళ్ల కోసం సోమవారం జరిగిన వేలంలో హోరాహోరీగా తలపడ్డాయి. సౌతాఫ్రికా 20 లీగ్‌లోని మొత్తం ఆరు జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల యాజమాన్యం చేతిలోనే ఉన్నాయి. ఎంఐ కేప్ టౌన్ జట్టును ముంబై ఇండియన్స్ యాజమాన్యం, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం , పార్ల్ రాయల్స్ జట్టును రాజస్థాన్ రాయల్స్…
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను నియమించింది. లెజెండరీ బ్యాట్స్‌మన్ టామ్ మూడీ స్థానంలో బ్రియాన్ లారాను ప్రధాని కోచ్‌గా నియమించినట్లు ఎస్ఆర్హెచ్ అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన బౌలింగ్ ప్రతిభతో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌లోనూ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ ఈ ఐపీఎల్లో అరుదైన ఫీట్ సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైనా లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడింది. సన్‌రైజర్స్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఉమ్రాన్ మాలిక్ ఆడగా ప్రతి మ్యాచ్‌లోనూ ఫాస్టెస్ట్ డెలివరీ…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు సునాయాసంగా చేధించింది. ఇది ఆ జట్టుకి ఏడో విజయం. ఈ మ్యాచ్‌తో లీగ్ దశ ముగిసింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలవగా.. హైదరాబాద్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో…
ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌పై సన్‌రైజర్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 3 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఖరి మ్యాచ్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండటం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్రకటించింది. Matthew…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో, ముంబైపై 3 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 9 పరుగులకే పెవిలియన్ చేరగా.. అతనితో పాటు క్రీజులో దిగిన ప్రియమ్ గార్గ్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లోనే…
తమ కోల్‌కతా టీమ్ సెలక్షన్ విషయంలో సీఈవో కూడా జోక్యం చేసుకుంటాడని గత వారం శ్రేయాస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జట్టు ఎంపిక విషయంలో సీఈవో జోక్యం చేసుకోవడం ఏంటి? అసలు శ్రేయాస్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. రానురాను ఇది చినికి చినికి గాలివానగా మారడం మొదలయ్యింది. దీంతో, శ్రేయాస్ అయ్యర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘‘గత మ్యాచ్‌లో సీఈవో ప్రస్తావన తీసుకురావడం వెనుక అసలు…
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడింది. శనివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో విలియమ్సన్ సేన ఓటమి పాలైంది. దీంతో వరుసగా ఐదు పరాజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. ఆండీ రసెల్, శామ్ బిల్లింగ్స్ అదరగొట్టడంతో 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. Symonds: ఆస్ట్రేలియా క్రికెట్లో మరో విషాదం.. సైమండ్స్ కన్నుమూత అనంతరం 178 పరుగుల…
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న కోల్‌కతా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. టాపార్డర్ సహా మిడిలార్డర్ బ్యాట్స్మన్లందరూ పెద్దగా ఆశాజనకమైన ప్రదర్శన కనబర్చకపోవడంతో.. కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ, రసెల్ రాకతో ఆ ఊహాగానాలన్నీ తారుమారు అయ్యాయి. అప్పటివరకూ కోల్‌కతా బ్యాట్స్మన్లకు…
సాధారణంగా క్రికెట్లో గోల్డెన్ డక్ అంటే అందరికీ తెలుసు.. కానీ డైమండ్ డక్ అంటే చాలా మందికి తెలియదు. అయితే ఆదివారం సన్‌రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ చూసిన వాళ్లకు డైమండ్ డక్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ డైమండ్ డక్ అయ్యాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే అవుటైతే దానిని డైమండ్ డక్ అంటారు. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మతో సమన్వయ లోపం కారణంగా విలియమ్సన్ ఖాతా…