‘రాజావారు రాణీగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలియచేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో హీరో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. రెండు భాగాలుగా తెరకెక్కుతునన్ “పుష్ప” ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ జులై నుంచి జెట్ స్పీడ్ లో జరగనుందట. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా 75 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. దర్శకుడు సుకుమార్ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని దసరా పండక్కి విడుదల చేయాలని భావిస్తున్నాడట. షూటింగ్ పునప్రారంభించిన వెంటనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. బన్నీ…
గత ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఊహాగానాలు రాగా.. మేకర్స్ అవన్నీ పుకార్లేనని క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం విషయంలో అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సుకుమార్ “పుష్ప” అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఐకాన్ స్టార్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేయగానే విజయ్…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ సరసన రష్మిక నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథ బాగా పెద్దది కావడంతో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. అయితే తాజాగా ఈ సినిమాపై సుకుమార్ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. పుష్ప మొదటి పార్ట్ ఒక్కటే పది కేజీయఫ్ సినిమాలతో సమానం అన్నాడు. అల్లు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరో పుష్పరాజ్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను ఏప్రిల్ 7న విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో 70 మిలియన్ వ్యూస్…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “పుష్ప” చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్రోల్ చేస్తున్నారు. కాగా తాజాగా సుకుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ భార్య తబిత ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలు చేపట్టింది. సుకుమార్ సహచరుడు, ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలను నిర్వహించే ప్రసాద్ అనే వ్యక్తి…
‘అల వైకుంఠపురములో’ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద…
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కొంతమంది సమయానికి ఆక్సిజన్ అందక కూడా మరణిస్తున్న సంఘటనలు ఎక్కువే అవుతున్నాయి. కాగా సినీ ప్రముఖుల కోవిడ్ బాధితుల కోసం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా దర్శకుడు సుకుమార్ తన వంతు సహాయం చేయడానికి శ్రీకారం చుట్టాడు. 25 లక్షల రూపాయలతో కోనసీమ ఏరియలోని కోవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లను అందించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే కొంతమంది కోసం ఎమర్జెన్సీ గా ఉందని ఆజాద్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 లాంటి విభిన్నమైన ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుందని ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ రెండో భాగానికి ఓ ప్రత్యేకమైన టైటిల్ను పెట్టాలని చిత్రబృందం ఆలోచిస్తుందని తెలిసింది. త్వరలోనే కొత్త పేరును ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారట. కరోనా…