ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప’.. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా పుష్ప నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదలడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అప్డేట్ రానున్నట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ ‘పుష్ప’రాజ్ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.