“సిగ్గు ఎందుకురా మామ” అంటున్న సుకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రాజావారు రాణీగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలియచేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో హీరో తండ్రిగా సాయికుమార్ నటించగా, తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. “చూశాలే కళ్ళారా, చుక్కల చున్నీతో” సాంగ్స్ అయితే యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. టీజర్ కు కూడా మంచి స్పందనే వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.
Read Also : “బాహుబలి” ఆఫర్ ను వదులుకున్న సామ్ ?
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
“సిగ్గు ఎందుకురా మామ” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రేపు ఉదయం 10 గంటలకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో త్వరలోనే సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాలు ప్రమోషన్లను స్టార్ట్ చేస్తున్నాయి. ఇక సాంగ్స్ తో ఆసక్తిని పెంచేసిన ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘సెబాస్టియన్ పి.సి. 524’, ‘సమ్మతమే’ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా మరో రెండు సినిమాలను కిరణ్ అబ్బవరం లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!