ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఈ రోజు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. “పుష్ప”కు డీఎస్పీ సంగీత సారధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మూవీ ఆడియో ఆల్బమ్ నుండి మొదటి సింగిల్పై పెద్ద అప్డేట్ను ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు.…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తను చదువుకున్న స్కూల్ కోసం భారీగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం మట్టపర్రు ప్రభుత్వ పాఠశాలను నిర్మించడానికి తనవంతు సాయం చేశారు. స్కూల్ భవనం కోసం సుకుమార్ రూ.18 లక్షలు ఖర్చుచేసి నిర్మించారు. అంతేకాకుండా భవనానికి తన తండ్రి పేరును పెట్టారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తో కలిసి సుకుమార్ దంపతులు ఈ భవనాన్ని ప్రారంభించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇకపై తాను మట్టపర్రు…
కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్న నాయకులను చూస్తున్నాం. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య. శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు అదే పని చేశారు స్టార్ డైరెక్టర్స్ అంతా కలిసి. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులంతా కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉన్న పిక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దానికి ఓ వేడుక కారణమైంది. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి జూలై 25న తన 42వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వేడుకలు వంశీ తన స్నేహితులు, చిత్ర పరిశ్రమకు…
సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” షూటింగ్ కు రీసెంట్ గా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సుకుమార్కు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో “పుష్ప” షూటింగ్ ఆగిపోయింది. దర్శకుడు సుకుమార్ రెస్ట్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ “పుష్ప షూటింగ్ కేవలం మూడు రోజులు ఆగిపోయింది. ప్రస్తుతం దర్శకుడు పూర్తిగా కోలుకున్నాడు. సుకుమార్ సోమవారం…
అగ్ర దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “పుష్ప” చిత్రీకరణను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. కానీ మళ్ళీ తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. సుకుమార్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడని సమాచారం. అందుకే ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. సుకుమార్ యాంటీబయాటిక్స్ తో పాటు ఇతర ఇంగ్లిష్ మందులకు దూరంగా ఉన్నాడు. ఆయన గత కొన్నేళ్లుగా హోమియోపతిని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు కూడా వైరల్…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, ధనంజయ్, ప్రకాష్ రాజ్, హరీష్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్ల కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మొదటిసారిగా గిరిజన యువతి పాత్రను పోషిస్తోంది. 2021 మార్చి మూడవ వారంలో ‘పుష్ప’ కోసం మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన…
గత కొన్ని సంవత్సరాలుగా కూల్ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేస్తున్న ఈ తరం ఉత్తమ నటులలో ఫహద్ ఫాసిల్ ఒకరు. ఏ విధమైన పాత్రలోనైనా ఒదిగిపోయే ఆయన నటన అద్భుతం. ఈ మలయాళ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్-థ్రిల్లర్ “పుష్ప” ద్వారా తెలుగు అరంగేట్రం చేస్తున్నాడు. ఆయనను ఇందులో విలన్ గా చూడటానికి అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫహద్ తనకు రామ్ చరణ్ “రంగస్థలం” బాగా నచ్చిందని, సుకుమార్…
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తన మొదటి చిత్రం “అల్లుడు శీను” డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలోనే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ “ఛత్రపతి” హిందీ రీమేక్ తో. ‘ఛత్రపతి’ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించారు. కాగా తాజాగా ఈ రోజు సినిమా ప్రారంభం జరిగింది. రాజమౌళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Read Also…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం పునఃప్రారంభమైంది. అయితే తాజాగా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ యాంకర్ అనసూయ గురువారం నుంచి షూటింగ్ కు హాజరైంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో పుష్ప చిత్రబృందం షూటింగ్ కు ప్యాకప్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్…