దేశ వ్యాప్తంగా మావోల ఏరివేతకు కేంద్రం పూనుకుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో తిష్ట వేసిన మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇక ఇటీవల కాలంలో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోతతో పచ్చని అడవి రక్తసిక్తమైంది. శనివారం సుక్మా జిల్లాలోని ఉపంపల్లిలోని గోగుండ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో తొమ్మిది మంది పేరుమోసిన నక్సలైట్లు శనివారం లొంగిపోయారు. వీరంతా భద్రతా బలగాలపై అనేక దాడులకు పాల్పడ్డారు. ఈ నక్సలైట్లకు ఒక్కొక్కరికి రూ.25 వేలు ఇచ్చి ప్రభుత్వ విధానం ప్రకారం.. పునరావాసం కల్పిస్తారు. గతేడాది బస్తర్ ప్రాంతంలో 792 మంది నక్సలైట్లు లొంగిపోయారు. సుక్మాతో సహా ఏడు జిల్లాలు ఈ ప్రాంతంలో వస్తాయి.
Chhattisgarh: మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పిలుపు ఇచ్చారు. దీంతో నలుగురు మావోయిస్టులు గురువారం సుక్మా జిల్లాలో భద్రతా దళ సిబ్బంది ముందు సరెండర్ అయ్యారు.
ఛత్తీస్‌గడ్ సరిహద్దులో మరోసారి నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. ఆశీర్‌గూడ సమీపంలోని 30వ జాతీయ రహదారిపై ప్రయాణికుల బస్సుతో సహా మూడు భారీ వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు నిర్వహించారు. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా crpf బలగాలు ఇంజరంకుం తరలించారు. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా సుక్మా కొంట…
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పేలుడు పదార్ధాలను, ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు మావోయిస్టులు తమ తలపై రూ.11 లక్షల నజరానాను కలిగి ఉన్నారని ఆయన చెప్పారు.
ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. కొంటా బ్లాక్‌లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం నలుగురిని కిడ్నాప్ చేయగా, శనివారం మరో గ్రామస్థుడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ చేసిన గ్రామస్థుల గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. గ్రామస్తులందరినీ సురక్షితంగా విడుదల చేయాలని సర్వ ఆదివాసీ సమాజ్ నక్సలైట్లకు విజ్ఞప్తి చేసింది.