బీహార్లోని భోజ్పూర్లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త టీ చేయమని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో భర్త విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
MP : మద్యం వ్యసనం ఎన్నో సంసారాలను విచ్ఛిన్నం చేస్తోంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మద్యం సేవించే ప్రతి వ్యక్తి చెడ్డవాడని దీని అర్థం కాదు. కానీ దాని మాయలో పడితే ఏం చేస్తారో కూడా అర్థం కాదు.
Nalgonda Crime నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. చింతలగూడెం గ్రామానికి చెందిన కోట రాజలింగం-రజిత కుమార్తె కోట కళ్యాణి(19) పాలిటెక్నిక్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్ద ఉంటుంది..
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా హతమార్చిన నిందితుడు సురేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం శివారులో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న సురేశ్ దర్శిని ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా చంపేశాడు. ప్రేమ పేరుతో వేధించడంతో దర్శిని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేశ్ జైలుకు వెళ్లాడు. ఆ కోపంతోనే హతమార్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంనకు చెందిన బద్ది దర్శిని రాంబిల్లి జిల్లా…
కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. గత 15 నెలల వ్యవధిలో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు తీవ్రమైన కరువు, పంట నష్టం మరియు విపరీతమైన అప్పులు అని రెవెన్యూ శాఖ పేర్కొంది.
ఓ యువకుడు సెల్ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.